NTV Telugu Site icon

Duleep Trophy 2024: దులీప్ ట్రోఫీలో అదరగొడుతున్న యంగ్ ప్లేయర్స్.. భారత జట్టులోకి వస్తామని ఆశాభావం

Akash Deep

Akash Deep

దులీప్ ట్రోఫీలో యువ ఆటగాళ్లు అదరగొడుతున్నారు. బ్యాటింగ్ విభాగంలో ముషీర్ ఖాన్ సెంచరీతో అదరగొట్టగా, ఇప్పుడు బౌలింగ్ విభాగంలో ఆకాశ్ దీప్ చెలరేగాడు. తొలి మ్యాచ్‌లోనే ఫాస్ట్ బౌలర్ ఆకాశ్ దీప్ అద్భుత ప్రదర్శన చేశాడు. ఇండియా బితో జరిగిన మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లు, రెండో ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీశాడు. అతని అద్భుత ప్రదర్శనతో శుభ్‌మన్ గిల్ నేతృత్వంలోని ఇండియా ఎ జట్టు విజయానికి చేరువైంది. అయితే.. దులీప్ ట్రోఫీలో మెరుగైన ప్రదర్శన చేసిన ఆటగాళ్లకు బంగ్లాదేశ్‌తో జరిగే టెస్టు సిరీస్‌లో ఆడే ఛాన్స్ లభించవచ్చు.

FADA: గుడ్ న్యూస్.. దేశంలో 7.8 లక్షల కార్ల నిలువలు.. భారీగా డిస్కౌంట్లు!

రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ ఆకాశ్ దీప్ రెండో ఇన్నింగ్స్ లో 14 ఓవర్లలో 56 పరుగులిచ్చి ఐదు వికెట్లు పడగొట్టాడు. తొలి ఇన్నింగ్స్‌లో 60 పరుగులకే నాలుగు వికెట్లు తీశాడు. ఈ విధంగా ఆకాశ్ దీప్ మ్యాచ్ లో తొమ్మిది వికెట్లు పడగొట్టాడు. ఈ క్రమంలో.. బంగ్లాదేశ్‌తో జరిగే రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌కు తనను సెలక్ట్ చేస్తారేమోనని ఆకాశ్ దీప్ ఆశాభావం వ్యక్తం చేశాడు. మరోవైపు.. టీమిండియాలో ఫాస్ట్ బౌలింగ్ కొరత ఉంది. జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్‌లకు ప్రత్యామ్నాయాలను కనుగొనడంపై సెలక్షన్ కమిటీ దృష్టి సారించింది. అయితే.. అనారోగ్యం కారణంగా సిరాజ్ టోర్నీ తొలి రౌండ్‌కు దూరంగా ఉండనున్నాడు. అలాగే.. ఆపరేషన్ తర్వాత షమీ పూర్తి ఫిట్‌గా లేడు. ఈ క్రమంలో ఆకాష్ దీప్ ను సెలెక్ట్ చేసే అవకాశముంది.

New Virus: చైనాలో మరో భయంకరమైన వైరస్.. మెదడుపై తీవ్ర ప్రభావం..

27 ఏళ్ల ఆకాష్ భారత్ తరఫున ఇప్పటివరకు ఒకే ఒక్క టెస్టు మ్యాచ్ ఆడాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో రాంచీలో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆకాశ్ తొలి ఇన్నింగ్స్‌లో 83 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. బీహార్ నుంచి కోల్‌కతా వచ్చిన తర్వాత రెండో ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లో ఆకాష్ అందరి దృష్టిని ఆకర్షించాడు. బెంగాల్ తరపున ఆడుతూ, అతను గుజరాత్‌పై ఆరు వికెట్లు పడగొట్టాడు. ఆ సీజన్ లో మొత్తం 35 వికెట్లు తీసి అందరినీ ఆకట్టుకున్నాడు.

Show comments