నిన్న (శుక్రవారం) మాజీ ఐఏఎస్ ఏకే గోయల్ ఇంట్లో ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్, టాస్క్ ఫోర్స్ అధికారులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 22లోని ఏకే గోయల్ ఇంట్లో ఎన్నికల బృందం, టాస్క్‌ఫోర్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఎన్నికల వేళ.. అధికార పార్టీ అభ్యర్థులకు భారీగా డబ్బులు గుంజినట్లు కాంగ్రెస్ నేతలు చేస్తున్న ఆరోపణల మేరకు అధికారులు సోదాలు చేశారు.
Read Also: Hyper Aadhi: హైపర్ ఆది పెళ్లి.. ఆమెతో ఏడడుగులు వేసిన జబర్దస్త్ కమెడియన్..?
ఈ క్రమంలో ఏకే గోయల్ మాట్లాడుతూ.. మా ఇంట్లో అక్రమ డబ్బు, మద్యం ఉన్నాయని ఫ్లైయింగ్ స్క్వాడ్ అధికారులు తనిఖీలు చేసేందుకు వచ్చారు, వారికి పూర్తిగా సహకరించానని తెలిపారు. తమ ఇంట్లో ఎలాంటి అక్రమ డబ్బు, మద్యం గుర్తించలేదని చెప్పారు. తమ ఇంట్లో అక్రమ డబ్బు, మద్యం ఉన్నాయని.. తన మీద ఆరోపణలు చేసి తన పరువుకు భంగం కలిగించారని ఆయన పేర్కొన్నారు. తన ఇంట్లో అక్రమ మద్యం, డబ్బు ఉంది అంటూ హడావిడి చేసిన కాంగ్రెస్ నేతలపై పరువు నష్టం దావా వేస్తానని ఏకే గోయల్ అంటున్నారు. మాజీ ఎంపీలు మల్లు రవి, హాజరుద్దీన్, ఖైరతాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థి విజయ రెడ్డి పై కోర్టులో కేసు వేస్తామని తెలిపారు. తన ఇంట్లో కాంగ్రెస్ నాయకులు చేసిన విధ్వంసం వీడియోలు ఆధారాలతో సహా ఉన్నాయి.. వాటిని అన్నింటిని కోర్టుకు అందజేస్తానన్నారు. వారిపై చర్యలు తీసుకోవాలని కోర్టును ఆశ్రయిస్తానని ఏకే గోయల్ పేర్కొన్నారు.
Read Also: Jagadeeshwar Goud: నా రాజకీయ జీవితం తెరిచిన పుస్తకం
