Site icon NTV Telugu

VidaaMuyarchi: అజిత్‌ ‘విదాముయార్చి’ రిలీజ్‌ డేట్‌ లాక్!

Vidaamuyarchi Release Date

Vidaamuyarchi Release Date

VidaaMuyarchi Release Date: తమిళ స్టార్‌ హీరో అజిత్‌ కుమార్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. మగిజ్ తిరుమేని దర్శకత్వంలో తెరక్కుతున్న సినిమా ‘విదాముయార్చి’. ఏకే 62గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో త్రిష కృష్ణన్ హీరోయిన్. ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ నిర్మిస్తోంది. ఇందులో ఆరవ్, అర్జున్, రెజీనా, సంజయ్‌ దత్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. విదాముయార్చికి సంబందించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Also Read: 39 Runs In Over: ఒకే ఓవర్‌లో 39 పరుగులు.. యువరాజ్ సింగ్ రికార్డు బ్రేక్!

విదాముయార్చి చిత్రం దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 31న గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ మేరకు ఓ పోస్టర్‌ నెట్టింట చక్కర్లు కొడుతోంది. రిలీజ్ డేట్‌ను మేకర్స్ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఈరోజు సాయంత్రం 4.33 అధికారిక ప్రకటన వస్తుందని తెలుస్తోంది. స్టైలిష్‌ బ్లాక్ గాగుల్స్ పెట్టుకున్న అజిత్.. డ్రైవింగ్‌లో ఉన్నట్టుగా నెట్టింట చక్కర్లు కొడుతోన్న పోస్టర్లో ఉంది. యాక్షన్‌ థ్రిల్లర్‌ జోనర్‌లో వస్తోన్న విదాముయార్చిపై భారీ అంచనాలు ఉన్నాయి. అధిక్ రవిచంద్రన్‌ డైరెక్షన్‌లో ‘గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ’లో కూడా ఏకే నటిస్తున్నాడు.

Exit mobile version