మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి బంపర్ విజయం సాధించిన తర్వాత ఏకనాథ్ షిండే, దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా అజిత్ పవార్ మాట్లాడుతూ.. అసలు ఎన్సీపీ ఎవరో ప్రజలే నిర్ణయించారని అన్నారు. “మేము ప్రారంభించిన లాడ్లీ బ్రాహ్మణ యోజన గేమ్ ఛేంజర్‌గా నిరూపించబడింది. నా రాజకీయ జీవితంలో ఒక కూటమి 200 కంటే ఎక్కువ సీట్లు సాధించడం ఇదే తొలిసారి. ఈ ఎన్నికల్లో ప్రతిపక్షాలు జీరో అయిపోయాయి. లోక్‌సభ ఎన్నికల్లో జరిగిన తప్పులను సరిదిద్దుకున్నాం. మేము మెరుగుపడ్డాం. కానీ.. లోక్‌సభ ఫలితాలతో సంతోషించిన వారు ఇప్పుడు ఈవీఎంలపై ప్రశ్నలు సంధిస్తున్నారు.” అని ఆయన వ్యాఖ్యానించారు.
READ MORE: Sharad Pawar: మహారాష్ట్రకు 4సార్లు సీఎం.. కేంద్ర, రాష్ట్ర రాజకీయాలను శాసించిన వ్యక్తి.. ఘోర పరాజయం!
మహారాష్ట్రలోని అన్ని రంగాల్లోనూ విజయం సాధించామని అజిత్ పవార్ అన్నారు. మనల్ని నిరాశకు గురి చేసిన ప్రాంతాలు లేవని సంతోషం వ్యక్తం చేశారు. “ఉదయం నేను వెనుకంజలో ఉన్నానంటూ వార్తలు వచ్చాయి. ఇప్పుడు నేను లక్షకు పైగా ఓట్లతో గెలిచాను. నన్ను కూడా ఆందోళనకు గురి చేసే వార్తలు వెలువడ్డాయి. నేను ఫోన్ చేసి అగడ్డా.. బ్యాలెట్ పేపర్‌లో కూడా నేనే ముందంజలో ఉన్నట్లు తెలిసింది. ప్రజలు మీడియాను నమ్ముతున్నారు. నకిలీ వార్తలు ప్రసారం చేయొద్దు.” అని ఆయన సూచించారు.
READ MORE:Kishan Reddy : మహారాష్ట్ర, జార్ఖండ్‌లో కలిపి కాంగ్రెస్‌కు 30 సీట్లు కూడా రాలేదు