Ajit Agarkar: ఆ ఒక్కడి మాస్టర్‌ మైండ్.. భారత్ ఖాతాలో మూడు ఐసీసీ ట్రోఫీలు..!

Ajit Agarkar

Ajit Agarkar

Ajit Agarkar: టీ20 వరల్డ్‌కప్ ను భారత జట్టు ముచ్చటగా మూడోసారి గెలుచుకుంది. 2026 టీ20 వరల్డ్‌కప్ ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ను 96 పరుగుల తేడాతో ఓడించి భారత్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్‌ లో జస్‌ప్రీత్ బుమ్రా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకోగా, ఇక టోర్నమెంట్ ఆధ్యంతం అత్యుత్తమంగా ఆడిన సంజు శాంసన్ ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌’గా ఎంపికయ్యాడు. అయితే టీమిండియాకు ఈ విజయాన్ని అందించడంలో మరో కీలక వ్యక్తి కూడా ఉన్నడనంలో ఎటువంటి సందేహం లేదు.

Sanju Samson History: టీ20 ప్రపంచ కప్‌ హిస్టరీలో సంజు నయా చరిత్ర.. హేమాహేమీలకు కూడా సాధ్యం కాలే!

×
×
Ad

అయితే అతను కోచ్ కాదు, ఆటగాడు కాదు, టీమ్ సపోర్ట్ స్టాఫ్‌ అసలే కాలేదు.. కానీ తన నిర్ణయాలతో భారత జట్టును విజయపథంలో నడిపించిన వ్యక్తి టీమిండియా చీఫ్ సెలెక్టర్ ‘అజిత్ అగర్కర్’. చీఫ్ సెలెక్టర్‌గా అజిత్ అగర్కర్ పదవీకాలం 2023 జూలై 4న మొదలయింది. అప్పటి నుంచి ఆయన తీసుకున్న కొన్ని నిర్ణయాలు భారత జట్టుకు వైట్ బాల్ ఫార్మాట్‌ లో ఎన్నో అద్భుత విజయాలను అందించాయి. ఆయన నేతృత్వంలో భారత జట్టు ఇప్పుడు మూడు ఐసీసీ టోర్నమెంట్‌లను గెలుచుకుంది.

ఇందులో 2024లో జరిగిన టీ20 వరల్డ్‌కప్ ఫైనల్‌ లో దక్షిణాఫ్రికాను ఓడించి భారత్ టైటిల్ గెలుచుకుంది. ఆ తర్వాత 2025 మార్చిలో న్యూజిలాండ్‌పై విజయం సాధించి చాంపియన్స్ ట్రోఫీని కైవసం చేసుకుంది. తాజాగా 2026 మార్చి 8న న్యూజిలాండ్‌ను ఓడించి మరోసారి టీ20 వరల్డ్‌కప్‌ను గెలుచుకుంది. ఈ విజయాలు అజిత్ అగర్కర్ తీసుకున్న కొన్ని కీలక నిర్ణయాలు టీమిండియాకు ఎంతో ప్రయోజనం చేకూర్చాయి. టీ20 ఇంటర్నేషనల్ జట్టుకు సూర్యకుమార్ యాదవ్‌ను కెప్టెన్‌గా నియమించడం అప్పట్లో వివాదాస్పదంగా మారింది. చాలా మంది అభిమానులు, క్రికెట్ నిపుణులు హార్దిక్ పాండ్యాకు కెప్టెన్సీ ఇవ్వాలని భావించినప్పటికీ.. ఆయన మాత్రం సూర్యకుమార్‌ పై పూర్తి నమ్మకం ఉంచారు. ఆ నిర్ణయం చివరకు మంచి ఫలితాలను ఇచ్చింది.

ICC T20 World Cup 2026 Team: భారత్‌ నుంచి నలుగురికి చోటు.. సూర్యకు షాక్, ఐసీసీ వరల్డ్ కప్‌ టీమ్‌కు కెప్టెన్ ఎవరంటే?

అదే విధంగా వన్డే జట్టు కెప్టెన్సీ నుంచి రోహిత్ శర్మను తప్పించి శుభ్‌మన్ గిల్‌ కు బాధ్యతలు అప్పగించడం కూడా ఆయన తీసుకున్న ఓ సాహసోపేత కీలక నిర్ణయం. రోహిత్ నాయకత్వంలో భారత్ చాంపియన్స్ ట్రోఫీ గెలిచిన వెంటనే ఈ మార్పు జరగడం అప్పట్లో పెద్ద చర్చనీయాంశమైంది. ఇంకా టీ20 వరల్డ్‌కప్ 2026కు ముందు ఇషాన్ కిషన్‌ ను జట్టులోకి తీసుకోవడం కూడా అజిత్ అగర్కర్ చేసిన మాస్టర్‌ స్ట్రోక్‌ గా చెప్పవచ్చు. ఈ టోర్నమెంట్‌లో ఇషాన్ కిషన్ అద్భుత ప్రదర్శనతో తన ఎంపికను సార్థకం చేసుకున్నాడు.

అంతేకాదు అగర్కర్ పదవీకాలంలో భారత జట్టు 2023 వన్డే వరల్డ్‌కప్ ఫైనల్‌కు కూడా చేరింది. అయితే ఆ ఫైనల్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమి పాలైంది. అయినప్పటికీ ఆయన తీసుకున్న వ్యూహాత్మక, సంచలన నిర్ణయాలు భారత క్రికెట్‌కు కొత్త విజయాలను అందించాయి. ప్రస్తుతం టీమిండియా వరుస విజయాలతో ప్రపంచ క్రికెట్‌లో తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది అంటే చీఫ్ సెలెక్టర్ ‘అజిత్ అగర్కర్’ పాత్ర ఖచ్చితంగా ఉంది.