NTV Telugu Site icon

Ajay Singh Yadav : కులగణన సిటీ స్కాన్ లాంటిది.. దేశం మొత్తం తెలంగాణ వైపు చూస్తోంది

Ajay Yadav

Ajay Yadav

Ajay Singh Yadav : జై బాపు, జై సంవిధాన్ ప్రోగ్రాం కోసం ఇక్కడికి వచ్చానని, సీఎం రేవంత్ రెడ్డి కులగణన చేశారు.. దేశం మొత్తం తెలంగాణ వైపు చూస్తోందన్నారు జాతీయ కాంగ్రెస్ ఓబీసీ చైర్మన్ అజయ్ సింగ్ యాదవ్. ఇవాళ ఆయన హైదరాబాద్‌లో మాట్లాడుతూ.. కులగణన సిటీ స్కాన్ లాంటిదని, 46శాతం బీసీ లకు 10 శాతం WESకు లోకల్ బాడీ ఎన్నికల్లో అమలు చేస్తోందన్నారు. కులగణన వలన వెనుకబడిన వర్గాలకు న్యాయం జరుగుతుందని ఆయన వ్యాఖ్యానించారు. ఇది గేమ్ చేయింజర్ లాంటిదని, దేశంలో అన్ని రాష్ట్రాలలో కూడా కులగణన చేయాలన్నారు. బీజేపీ రాజ్యంగం మీద దాడి చేస్తుందన్నారు అజయ్ సింగ్ యాదవ్. కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగం మీద దాడి చేస్తుంటే.. రాహుల్ గాంధీ ఒక్కడే ప్రతి పక్ష నేతగా బీజేపీ ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై పోరాటం చేస్తుండన్నారు అజయ్ సింగ్ యాదవ్.

Hyderabad: ‘మీ ఆవిడని నాకిచ్చేయ్‌’.. ప్రియురాలి భర్తతో ప్రియుడు గొడవ

మోడీ, అమిత్ షా లో ఈడీ,సిబిఐలతో కాంగ్రెస్ నేతపై లతో దాడి చేస్తున్నారని, మహారాష్ట్ర, హరియాన ఎన్నికల్లో కాంగ్రెస్ బాగా పుంజుకుందన్నారు అజయ్ సింగ్ యాదవ్. అంతేకాకుండా.. ఈవీఎంలు వద్దు బ్యాలెట్ పేపర్లు ముద్దు అనేది కాంగ్రెస్ నినాదం.. ఓబీసీ విద్యార్థులు ఎలాంటి స్కాలర్ షిప్ లు,నీట్ లో సీట్లు పొందలేక పోతున్నారు.. కేంద్ర ప్రభుత్వం క్రిమిలేయర్ ను ఎత్తి వేయాలన్నారు అజయ్ సింగ్ యాదవ్. కాంగ్రెస్ ముస్లిం పార్టీ కాదని, 2011 లో కులగణన చేశారన్నారు. 2014 లో ఎందుకు పార్లమెంట్ లో బిల్ పెట్టలేదని ఆయన వ్యాఖ్యానించారు.

Vivo V50: కేక పుట్టించే ఫీచర్లతో.. మార్కెట్ లోకి విడుదలైన వివో మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్