NTV Telugu Site icon

Ajay Pratap Singh: బీజేపీకి షాక్.. రాజ్యసభ ఎంపీ అజయ్ ప్రతాప్ సింగ్ రాజీనామా

Ajay

Ajay

Ajay Pratap Singh: లోక్‌సభ ఎన్నికల ముందు మధ్యప్రదేశ్‌లో భారతీయ జనతాపార్టీకి గట్టి షాక్‌ తగిలింది. ఆ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు అజయ్‌ ప్రతాప్‌ సింగ్‌ పార్టీకి రాజీనామా చేస్తున్టన్లు ప్రకటించారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన ఆయన తన అధికారిక ట్విట్టర్ (X) ఖాతాలో పోస్టు చేశారు. ఈ విషయాన్ని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు మధ్య ప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు వీడీ శర్మకు తన రాజీనామా లేఖను పంపించాడు. 2018 మార్చిలో బీజేపీ అజయ్‌ ప్రతాప్‌ సింగ్‌ను రాజ్యసభకు నామినేట్‌ చేసింది. కాగా, ఇవాళ మధ్యాహ్నం మూడు గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ ను రిలీజ్ చేయనుంది.

Read Also: YSRCP MP Candidates List: వైసీపీ ఫైనల్‌ లిస్ట్‌.. ఎంపీ అభ్యర్థులు వీరే..

అయితే, మధ్యప్రదేశ్‌లోని మొత్తం 29 లోక్‌సభ స్థానాలకు బీజేపీ అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. అయితే, లోక్‌సభ ఎన్నికల్లో సిద్ధి నుంచి అజయ్‌ ప్రతాప్‌సింగ్‌ టికెట్‌ ఆశిస్తున్నట్లు సమాచారం. అజయ్ ప్రతాప్ సింగ్ స్వతంత్ర అభ్యర్థిగా సిద్ధి నుంచి నేరుగా ఎన్నికలలో పోటీ చేయవచ్చని ఊహాగానాలు ఉన్నాయి. అయితే భవిష్యత్తుపై తాను ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. అజయ్ ప్రతాప్ సింగ్‌తో సహా నలుగురు రాజ్యసభ సభ్యుల పదవీకాలం 2 ఏప్రిల్ 2024తో ముగుస్తుంది.

Read Also: Bihar : నిర్మాణంలో ఉండగానే కూలిన భవనం.. ఇద్దరు మృతి.. ఆరుగురికి గాయాలు

ఇక, సిద్ధిలో రాజేష్ మిశ్రాను బీజేపీ తన అభ్యర్థిగా నిలబెట్టింది. మిశ్రా బహుజన్ సమాజ్ పార్టీ నుంచి రాజకీయాలను ప్రారంభించారు. ఆ తర్వాత బీఎస్పీ టికెట్‌పై అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. అయితే ఎన్నికల్లో ఓడిపోయారు.. ఆ తర్వాత ఆయన 2009లో బీజేపీ సభ్యత్వం తీసుకుని ఆ పార్టీ కోసం పని చేస్తున్నారు. ఇప్పుడు పార్టీ ఆయనను లోక్ సభ అభ్యర్థిగా నిలబెట్టింది. దీనిపై స్థానికంగా బీజేపీలో వ్యతిరేకత వ్యక్తమవుతోంది.