Aishwarya Rajinikanth : మా నాన్న ‘సంఘీ’ కాదు.. కన్నీళ్లు పెట్టుకున్న రజనీకాంత్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ గత ఏడాది ‘జైలర్’ సినిమాతో బిగ్గెస్ట్ హిట్ అందుకున్నారు.ప్రస్తుతం తలైవా వరుస సినిమాలు చేస్తూ బిజీ గా వున్నారు. వీటిలో ఐశ్వర్య రజినీకాంత్ డైరెక్ట్ చేస్తున్న లాల్ సలామ్ మూవీ ఒకటి..ఈ సినిమాలో విష్ణు విశాల్ మరియు విక్రాంత్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా ఫిబ్రవరి 09 న ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ చిత్ర విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో ఐశ్వర్య రజినీకాంత్ ప్రమోషన్స్ లో వేగం పెంచారు.. రిపబ్లిక్ డే కానుక గా ఈ సినిమా ఆడియో లాంఛ్ ఈవెంట్ చెన్నైలో ఎంతో గ్రాండ్గా జరిగింది. అయితే ఈ ఈవెంట్ లో ఐశ్వర్య మాట్లాడుతూ.. రజినీకాంత్ పై వస్తున్న వరుస ట్రోల్స్ పై స్పందించారు..
సోషల్ మీడియాలో మా నాన్న ‘సంఘీ’ అంటూ కామెంట్స్ వస్తున్నాయి. నిజానికి సోషల్ మీడియాకు నేను చాలా దూరంగా ఉంటా.. ఆన్లైన్ నెగెటివిటీ గురించి నా టీమ్ ఎప్పుడు చెబుతూ ఉంటుంది… అలాగే నాన్నగారిపై వస్తున్న నెగటివిటీ గురించి కూడా నా టీమ్ ద్వారా నేను తెలుసుకున్నాను. మేము కూడా మనుషులమే. మాకూ ఎమోషన్స్ ఉంటాయి. ఈ మధ్యకాలంలో నా తండ్రిని ‘సంఘీ'(హిందుత్వ ఐడియాలజీని ఫాలో అయ్యేవారు) అంటూ విమర్శలు చేస్తున్నారు. అయితే ‘సంఘీ’ అంటే మొదట్లో నాకు కూడా అర్ధం తెలిదు. కానీ తర్వాత దానికి అర్థం తెలుసుకున్నా. ఒక రాజకీయ పార్టీ కి మద్దతు ఇచ్చేవారిని ‘సంఘీ’ అని పిలుస్తారని తర్వాత తెలుసుకున్నాను. రజనీకాంత్ సంఘీ కాదు. నాన్న అలాంటి వారే అయితే లాల్ సలామ్ చిత్రంలో మొయినుద్దీన్ భాయ్ పాత్ర లో నటించే వారే కాదు. దయచేసి ఇలాంటివి ఆపండి అంటూ ఐశ్వర్య రజనీకాంత్ చెప్పుకొచ్చారు.. అయితే ఐశ్వర్య మాటలు విన్న రజనీకాంత్ అక్కడే కన్నీళ్లు పెట్టుకున్నారు.
Also Read
- Petrol Diesel Purchase: కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ఇక వారికి బంకుల్లో నో పెట్రోల్, డీజిల్!
- Indian Railways: రైలు ఆలస్యమైనా ప్రయాణికుడి తప్పేనా..? ప్లాట్ఫామ్ టికెట్ సమయం ముగిసిందంటూ రూ.520 జరిమానా.! వీడియో వైరల్..
- Cyber Crime: ఆన్లైన్ డేటింగ్ ఉచ్చులో మహిళా న్యాయమూర్తి.. జడ్జిగారి 'రోమాన్స్ స్కామ్' కథ వింటే నోరెళ్లబెడతారు!
- Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!
తాజావార్తలు
-
Sing Geetham Review : సింగ్ గీతం రివ్యూ.. సింగీతం ప్రయోగం ఎలా ఉందంటే?
-
SPIRIT : ప్రభాస్ కోసం అసలు సిసలైన డ్యూటీ చేస్తున్న సందీప్ రెడ్డి
-
Petrol Diesel Purchase: కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ఇక వారికి బంకుల్లో నో పెట్రోల్, డీజిల్!
-
Indian Railways: రైలు ఆలస్యమైనా ప్రయాణికుడి తప్పేనా..? ప్లాట్ఫామ్ టికెట్ సమయం ముగిసిందంటూ రూ.520 జరిమానా.! వీడియో వైరల్..
-
Gold Rate Today: భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఒక్కరోజులోనే షాకిచ్చిన బులియన్ మార్కెట్!
ట్రెండింగ్
-
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!
-
iQOO Flagship Days Sale ప్రారంభం.. iQOO 15, iQOO 15R, Neo 10పై భారీ తగ్గింపులు.!
-
Bangladesh History: ఆస్ట్రేలియాపై చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి!
-
FIFA World Cup: రెండు గోల్స్, మూడు రెడ్ కార్డ్స్.. దక్షిణాఫ్రికాను చిత్తు చేసి బోణి కొట్టిన మెక్సికో.!
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..