Site icon NTV Telugu

Aishwarya Rajesh : ‘ఓ..! సుకుమారి’గా ఐశ్వర్య రాజేష్: పల్లెటూరి పిల్లగా ఆకట్టుకుంటున్న ఫస్ట్ లుక్!

Aishwarya Rajesh

Aishwarya Rajesh

తెలుగు అమ్మాయి అయినప్పటికీ తమిళ ఇండస్ట్రీలో తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్ ఐశ్వర్య రాజేష్. తెలుగులో కూడా పలు చిత్రాల్లో నటించినప్పటికీ అనుకున్నంత హిట్‌లు మాత్రం పడలేదు. కానీ లాస్ట్ ఇయర్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీతో బ్లాక్ బాస్టర్ హిట్ అందుకుంది ఐశ్వర్య. అప్పటి నుంచి వరుస ప్రాజెక్ట్ లు అందుకుంటున్న ఈ ముద్దుగుమ్మ ప్రజంట్ హీరో తిరువీర్ సరసన ‘ఓ..! సుకుమారి’ అనే మూవీ తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. కొత్త దర్శకుడు భరత్ దర్శన్ రూపొందిస్తున్న ఈ క్యూట్ విలేజ్ ఎంటర్‌టైనర్‌ను గంగా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై మహేశ్వర్ రెడ్డి మూలి నిర్మిస్తున్నారు. తాజాగా,

ఐశ్వర్య రాజేష్ పుట్టినరోజు సందర్భంగా చిత్ర యూనిట్ ఆమె ఫస్ట్ లుక్‌ను విడుదల చేసింది. ఈ సినిమాలో ఆమె ‘దామిని’ అనే అల్లరి చేసే పల్లెటూరి అమ్మాయి పాత్రలో కనిపిస్తుంది. రంగురంగుల పరికిణీ వోణీ కట్టుకుని, చేతిలో కర్రలు పట్టుకుని ఊరి జనం నుంచి తప్పించుకోవడానికి పరిగెడుతున్న ఆమె లుక్ చూస్తుంటే, సినిమాలో ఆమె పాత్ర ఎంత చురుగ్గా, వినోదాత్మకంగా ఉండబోతుందో అర్థమవుతోంది. ఇక ఈ సినిమా కేవలం వినోదమే కాకుండా మంచి ఎమోషన్స్.. డ్రామాతో కూడి ఉంటుందని చిత్ర బృందం చెబుతోంది. ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి శిష్యుడు భరత్ మంచి రాజు ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తుండగా, సి.హెచ్ కుషేందర్ కెమెరా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా విడుదల కానుంది. ‘పొలిమేర’ వంటి హిట్ చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న తిరువీర్, హోమ్లీ లుక్‌తో మెప్పించే ఐశ్వర్య రాజేష్ కాంబినేషన్ కావడంతో ప్రేక్షకుల్లో ఈ సినిమాపై మంచి ఆసక్తి నెలకొంది.

Exit mobile version