ఐశ్వర్య రాజేశ్.. ఈ డస్కీ బ్యూటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తన నటనతో, అభినయంతో అందరినీ బాగా ఆకట్టుకుంది. అలాగే వరుసగా సినిమాలలో అవకాశాలు కూడా అందుకుంటుంది ఈ భామ.సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టీవ్ గా ఉంటుంది ఈ భామ. నిత్యం బ్యూటీఫుల్ లుక్ లో మెరుస్తూ బాగా ఆకట్టుకుంటుంది. ఈ భామ సంప్రదాయ దుస్తుల్లో ఎంత క్యూట్ గా ఉంటుంది..అలాగే గ్లామర్ షోకు కాస్త దూరంగా ఉంటుంది.ఓవైపు వరుస సినిమాలతో బిజీగా ఉన్నా.. మరోవైపు అట్రాక్టివ్ లుక్ లో నెట్టింట దర్శనమిస్తూ బాగా ఆకట్టుకుంటోంది. క్యూట్ లుక్స్ తో కట్టిపడేస్తుంది.తాజాగా ఐశ్వర్య రాజేష్ బ్యూటీఫుల్ లెహంగా, మ్యాచింగ్ బ్లౌజ్ లో కనిపించింది.లీఫ్స్ ప్రింటెడ్ గల గౌన్ లో ఎంతో ముద్దుగా ఉంది.. మొత్తానికి ట్రెడిషన్ వేర్ లో గ్లామర్ టచ్ ఇస్తూ ఫ్యాన్స్ ను ఫిదా చేస్తోంది ఈ భామ.. ఫ్యాన్స్ కూడా ఈ బ్యూటీ పిక్స్ ను లైక్స్ మరియు కామెంట్లతో తెగ వైరల్ చేస్తున్నారు.
ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ వెకేషన్ లో ఎంజాయ్ చేస్తుంది.. ఈ సందర్భంగా వరుసగా ఫొటోషూట్లు కూడా చేస్తోంది. తన వెకేషన్ నుంచి కూడా స్టన్నింగ్ పిక్స్ ను పోస్ట్ చేస్తూ బాగా ఆకట్టుకుంటోంది. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం ఐశ్వర్య కేరీర్ జోరు మీద ఉంది.. వరుసగా సినిమాలు చేస్తోంది. అటు ఓటీటీ చిత్రాలు మరియు వెబ్ సీరిస్ లో కూడా నటిస్తుంది..ఈ ముద్దుగుమ్మ తెలుగులో మాత్రం కొన్ని సినిమాలే చేసింది.. కానీ తన నటనతో ప్రేక్షకులను ఎంతగానో అలరించింది..తెలుగులో చివరిగా ‘రిపబ్లిక్’లో మెరిసింది. ఆ తర్వాత తమిళం మరియు మలయాళం చిత్రాల్లో నటిస్తూ ఎంతో బిజీగా ఉంది. ప్రస్తుతం ఈ భామ తమిళ స్టార్ హీరో, చియాన్ విక్రమ్ హీరోగా గౌతమ్ మీనన్ తెరకెక్కిస్తున్న ‘ధృవ నక్షత్రం’ సినిమాలో నటించింది.ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది.
