NTV Telugu Site icon

Aishwarya Rajesh: వెంకటేష్ పక్కన కూర్చున్న మీనాక్షిని నిర్ధాక్షిణ్యంగా లేపేసిన ఐశ్వర్య

Venkatesh

Venkatesh

అదేమిటి వెంకటేష్ పక్కన కూర్చున్న మీనాక్షిని ఐశ్వర్య నిర్ధాక్షణ్యంగా లేపేయడం ఏమిటి అని మీకు అనుమానం కలగవచ్చు. అసలు విషయం ఏమిటంటే సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాతో ఐశ్వర్య రాజేష్ తెలుగు ప్రేక్షకులను పలకరించేందుకు సిద్దమవుతోంది. వెంకటేష్ హీరోగా మీనాక్షి చౌదరి మరో హీరోయిన్ గా ఈ సినిమా తెరకెక్కింది. సంక్రాంతి కానుకగా ఈ సినిమా జనవరి 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

READ MORE: kites: గాలిపటాలు ఎగిరేసేటప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోండి.. లేదంటే…

ఈ నేపథ్యంలో ఈరోజు బ్లాక్ బస్టర్ మ్యూజికల్ నైట్ పేరుతో ఒక ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్ కి ముందుగా వెంకటేష్ రాగా ఆ తర్వాత హీరోయిన్ మీనాక్షి చౌదరి వచ్చింది. వీరిద్దరూ పక్కపక్కనే ఒక సోఫాలో కూర్చున్నారు. ఈవెంట్ జరుగుతూ ఉంది, పిల్లల పాటలు పాడుతున్నారు, డాన్స్ చేస్తున్నారు. కొద్దిసేపటికి ఐశ్వర్య రాజేష్ ఎంట్రీ ఇచ్చింది. ఎంట్రీ ఇచ్చిన తర్వాత మీనాక్షి వెంకటేష్ పక్కన కూర్చున్న విషయం చూసి ఏయ్ పక్షి అర్జెంటుగా ఇక్కడి నుంచి లేచి పక్కకి వెళ్ళిపో అంటూ ఆమెను వెంకటేష్ పక్కనుంచి పంపించి వేయడమే గాక ఆ ప్లేస్లో తాను కూర్చుంది.

READ MORE: IPO : 2025 లో 90 కి పైగా ఐపిఓలు… పరిమాణం రూ.లక్ష కోట్ల పై మాటే

ఈ సినిమాలో వెంకటేష్ భార్య పాత్రలో ఐశ్వర్య కనిపిస్తుండగా మాజీ ప్రేయసి పాత్రలో మీనాక్షి కనిపిస్తోంది. సినిమాలో వీరి మధ్య ఇలాంటి కాంబినేషన్ ఉండడంతో బయట కూడా దాన్ని ప్రమోషన్ కోసం చూపించారా లేక సరదాగా చేసి చూపించారో కానీ అది మాత్రం రియలిస్టిక్ గా అనిపించింది. ఇక ఈ సినిమాని దిల్ రాజు సమర్పిస్తుండగా ఆయన సోదరుడు శిరీష్ నిర్మించారు.

Show comments