టాలీవుడ్ హిస్టరీలో బిగ్గెస్ట్ హిట్లలో ఒకటిగా నిలిచిన ‘గీత గోవిందం’ సినిమా రష్మిక మందన్నకు ‘నేషనల్ క్రష్’ ఇమేజ్‌ను తెచ్చిపెట్టింది. అయితే, ఈ సినిమాలో ‘గీత’ పాత్రకు రష్మిక మొదటి ఛాయిస్ కాదట! తాజాగా నటి ఐశ్వర్య అర్జున్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం తనను మొదట సంప్రదించినట్లు వెల్లడించారు.
ఐశ్వర్య అర్జున్ మాట్లాడుతూ.. ‘కొన్ని కారణాల వల్ల నేను ‘గీత గోవిందం’లో నటించే అవకాశాన్ని కోల్పోయాను. ఆ తర్వాత ఆ పాత్ర కోసం చాలా మంది హీరోయిన్లను సంప్రదించారని విన్నాను. ఫైనల్‌గా ఆ సినిమా చాలా బాగా వచ్చింది. నేను మిస్ చేసుకున్న చాలా సినిమాలు ఆ తర్వాత పెద్ద సక్సెస్ అయ్యాయి’ అని ఆమె పేర్కొన్నారు. ఐశ్వర్య అర్జున్ ఇటీవలే ‘సీతా పయనం’ అనే సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఆమె ఈ ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నారు. నిజానికి దర్శకుడు పరశురామ్ ఈ కథను రష్మిక కంటే ముందు రాకుల్ ప్రీత్ సింగ్, సాయి పల్లవి వంటి స్టార్ హీరోయిన్లకు కూడా వినిపించారట. డేట్స్ అడ్జస్ట్ కాకపోవడం వల్ల వారు నో చెప్పడంతో, ఆ అవకాశం రష్మిక వద్దకు చేరింది. రష్మిక తన నటనతో ఆ పాత్రకు ప్రాణం పోసి, ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. రష్మిక విజయ్ దేవరకొండ కెరీర్‌లో ఈ సినిమా ఒక ల్యాండ్‌మార్క్‌గా నిలిచిపోయింది.
