NTV Telugu Site icon

Airtel SIM: 10 నిమిషాల్లో ఇంటికే ఎయిర్‌టెల్ సిమ్ డెలివరీ.. రూ. 49 చెల్లిస్తే చాలు..

Airtel

Airtel

ఇప్పుడు మీకు ఎయిర్‌టెల్ సిమ్ కార్డ్ కావాలంటే షాప్ కి వెళ్లాల్సిన అవసరం లేదు. టెలికాం దిగ్గజం ఎయిర్ టెల్ సరికొత్త సేవలను ప్రారంభించింది. పది నిమిషాల్లోనే కస్టమర్లకు సిమ్ కార్డులను డెలివరీ చేయడానికి కంపెనీ ఇప్పుడు క్విక్ కామర్స్ ప్లాట్‌ఫామ్ బ్లింకిట్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. దీంతో మీరు ఇంట్లో కూర్చుని నిమిషాల్లోనే కొత్త సిమ్ కార్డ్ పొందే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ సేవలు దేశంలోని 16 నగరాల్లో ప్రారంభించారు.

Also Read:Black, White & Gray Trailer : ఆసక్తికరంగా ‘బ్లాక్, వైట్ అండ్ గ్రే – లవ్ కిల్స్’ ట్రైలర్

ఢిల్లీ, గురుగ్రామ్, ఫరీదాబాద్, సోనిపట్, అహ్మదాబాద్, సూరత్, చెన్నై, భోపాల్, ఇండోర్, బెంగళూరు, ముంబై, పూణే, లక్నో, జైపూర్, కోల్‌కతా మరియు హైదరాబాద్ వంటి మెట్రోపాలిటన్ నగరాలు ఉన్నాయి. కేవలం రూ. 49 నామమాత్రపు ఛార్జీతో 10 నిమిషాల్లోనే వినియోగదారులకు వారి ఇంటి వద్దకే సిమ్ కార్డులను డెలివరీ చేస్తోంది. సిమ్ కార్డు డెలివరీ అయిన తర్వాత, కస్టమర్లు ఆధార్ ఆధారిత KYC ప్రామాణీకరణ ద్వారా నంబర్‌ను యాక్టివేట్ చేసుకోవచ్చు.

Also Read:ESIC Recruitment 2025: ఈఎస్ఐసీలో 558 స్పెషలిస్ట్ గ్రేడ్-II జాబ్స్.. నెలకు రూ. 78 వేల జీతం.. అర్హులు వీరే

కస్టమర్లు పోస్ట్‌పెయిడ్ లేదా ప్రీపెయిడ్ ప్లాన్‌లను ఎంచుకునే అవకాశం లేదా ఎయిర్‌టెల్ నెట్‌వర్క్‌కు పోర్ట్ చేయడానికి MNPని ట్రిగ్గర్ చేసే అవకాశం కూడా ఉంది. అన్ని యాక్టివేషన్‌ల కోసం మీరు ఎయిర్‌టెల్ థాంక్స్ యాప్‌ను కూడా ఉపయోగించుకోవచ్చు. కొత్త కస్టమర్లు ఏదైనా సహాయం అవసరమైతే 9810012345 నంబర్‌కు కాల్ చేయవచ్చు. సిమ్ కార్డు డెలివరీ అయిన తర్వాత మీరు 15 రోజుల్లోపు సిమ్‌ను యాక్టివేట్ చేసుకోవాలి.