Site icon NTV Telugu

Airtel Recharge Plan: 1.5GB రోజువారీ డేటా, 84 రోజుల వ్యాలిడిటీ.. ఇది కంపెనీ బెస్ట్ ప్లాన్!

Airtel

Airtel

ఎయిర్‌టెల్ తన కస్టమర్లకు అదిరిపోయే బెనిఫిట్స్ తో రీఛార్జ్ ప్లాన్‌లను అందిస్తోంది. ఈ ప్లాన్‌లు వివిధ కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా రూపొందించింది. కంపెనీ బెస్ట్ ప్లాన్స్ లో ఓ ప్లాన్ 1.5GB రోజువారీ డేటాతో వస్తుంది. ఈ ప్లాన్ 84 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ఎయిర్‌టెల్ తన కస్టమర్లకు రూ. 859 ప్లాన్‌ను అందిస్తోంది. ఈ ప్లాన్‌లో రోజుకు 1.5GB డేటా, అపరిమిత లోకల్, STD, రోమింగ్ కాల్స్, రోజుకు 100 SMSలు లభిస్తాయి. స్పామ్ ప్రొటెక్షన్, ఉచిత హలోట్యూన్స్ కూడా ఈ ప్లాన్‌లో భాగం.

Also Read:Bheems Ceciroleo: మన గురించి ఇక్కడ తెలిస్తే చాలదు.. ముంబాయిలో కూడా తెలియాలి!

మీరు కొంచెం తక్కువ ధర గల ప్లాన్ కోసం చూస్తున్నట్లయితే, కంపెనీ రూ. 799 ప్లాన్‌ను కూడా అందిస్తుంది. ఇది రోజుకు 1.5GB డేటాను అందిస్తుంది. అయితే, ఈ ప్లాన్ 77 రోజుల చెల్లుబాటుతో వస్తుంది. రూ. 859 ప్లాన్ లాగానే, ఇది అపరిమిత లోకల్, STD, రోమింగ్ కాల్స్, రోజుకు 100 SMSలను కూడా అందిస్తుంది. స్పామ్ ప్రొటెక్షన్, ఉచిత HelloTunes కూడా అందుబాటులో ఉన్నాయి.

Also Read:Mahesh Babu : సెట్లో మహేష్ బాబు చిలిపి పని.. నిర్మాతకు ఒకటే ‘మ్యూజిక్కు’

మీరు 60 రోజుల ప్లాన్ లేదా రెండు నెలల ప్లాన్ కావాలనుకుంటే.. ఎయిర్‌టెల్ రూ. 619 ప్లాన్ మంచి ఎంపిక. ఇది రోజుకు 1.5GB డేటా, అపరిమిత కాలింగ్, రోజుకు 100 SMSలను కూడా అందిస్తుంది. ఇది స్పామ్ ప్రొటెక్షన్, ఉచిత హలోట్యూన్స్, ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ప్లేలను కూడా అందిస్తుంది.

Exit mobile version