Site icon NTV Telugu

Airtel: ఎయిర్‌టెల్‌కు జరిమానా.. ఏకంగా లక్షల్లో.. ఎందుకంటే?

Airtel

Airtel

భారతదేశంలో రెండవ అతిపెద్ద టెలికాం సర్వీస్ ప్రొవైడర్ అయిన భారతీ ఎయిర్‌టెల్‌కు టెలికమ్యూనికేషన్స్ విభాగం రూ.2.14 లక్షల జరిమానా విధించింది. కర్ణాటక టెలికాం సర్కిల్‌లోని సబ్‌స్క్రైబర్ వెరిఫికేషన్ నియమాలను పాటించడంలో టెలికాం విఫలమైనందున ఈ జరిమానా విధించినట్లు తెలిపింది. అవసరమైన ధృవీకరణ ప్రక్రియను పూర్తి చేయకుండానే కంపెనీ సిమ్ కార్డులను జారీ చేసిందని, ఇది దాని లైసెన్స్ షరతులను ఉల్లంఘించడమేనని DoT వెల్లడించింది.

Also Read:CM Chandrababu: విజయవాడ వీధుల్లో సీఎం చంద్రబాబు కాలి నడక.. చిరు వ్యాపారులతో మాట ముచ్చట!

PTI నివేదిక ప్రకారం, కర్ణాటకలో ఎయిర్‌టెల్ వెరిఫికేషన్-తప్పనిసరి విధానాన్ని పాటించకుండా కొత్త సబ్‌స్క్రైబర్‌లను యాడ్ చేసిందని ఆరోపించింది. దాని లైసెన్స్ ఒప్పందం నిబంధనల ప్రకారం, ప్రతి టెలికాం ఆపరేటర్ ఏదైనా కనెక్షన్‌ను యాక్టివేట్ చేసే ముందు కస్టమర్ల సరైన గుర్తింపు, చిరునామా ధృవీకరణను తీసుకోవాల్సి ఉంటుంది. ఆగస్టు 2025లో DoT నిర్వహించిన ఆడిట్‌లో, ఎయిర్‌టెల్ కస్టమర్ దరఖాస్తు ఫారమ్‌లు (CAFలు అని పిలుస్తారు) సరైన రీతిలో ధృవీకరించబడలేదని వెల్లడైంది.

Also Read:Diwali Festival 2025: దీపావళి పండగ రోజు దీపాలు ఎందుకు ముట్టిస్తారో తెలుసా..?

దీంతో DoT ప్రముఖ టెలికాం సర్వీస్ ప్రొవైడర్‌కు అధికారిక నోటీసు జారీ చేసి రూ. 2.14 లక్షల జరిమానా విధించింది. ఎయిర్‌టెల్ నోటీసును అంగీకరించి జరిమానా చెల్లించడానికి అంగీకరించింది. టెలికాం కంపెనీలు సమర్పించిన CAFల ఆడిట్‌లను టెలికమ్యూనికేషన్ విభాగం క్రమం తప్పకుండా నిర్వహిస్తుంది. దేశంలో సిమ్ సంబంధిత మోసాలను, మొబైల్ కనెక్షన్లను మరింత దుర్వినియోగం చేయకుండా నిరోధించడానికి ప్రభుత్వం చేస్తున్న విస్తృత ప్రయత్నాల్లో భాగంగా ఈ సాధారణ తనిఖీలు జరుగుతున్నాయి.

Exit mobile version