ఎయిర్ టెల్ యూజర్లకు గుడ్ న్యూస్. ఏడాది పాటు వ్యాలిడిటీ ఉండే ప్లాన్ కోసం ఎదురుచూస్తున్నారా? అది కూడా తక్కువ ధరలో కావాలని భావిస్తున్నారా? దాదాపు 400 మిలియన్ల మంది సబ్‌స్క్రైబర్‌లతో భారత్ లో రెండవ అతిపెద్ద టెలికాం ఆపరేటర్‌గా ఉన్న ఎయిర్ టెల్ ఆకర్షణీయమైన దీర్ఘకాలిక రీఛార్జ్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. రూ. 2,249 ధరతో, అదిరిపోయే బెనిఫిట్స్ ను అందిస్తోంది. మొబైల్ వినియోగదారులు నెలవారీ రీఛార్జ్ ఖర్చులతో నిరంతరం పోరాడుతున్న మార్కెట్లో, ఎయిర్‌టెల్ రూ. 2,249 వార్షిక ప్లాన్ సరసమైన ప్రత్యామ్నాయంగా కనిపిస్తుంది. వినియోగదారులు పూర్తి 365-రోజుల వ్యాలిడిటీని పొందుతారు.
వాయిస్ కాల్స్, ఇంటర్నెట్ సర్వీస్ వంటి ప్రధాన అవసరాలను పూర్తిగా కవర్ చేసేలా ఎయిర్‌టెల్ నిర్ధారించింది. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని నెట్‌వర్క్‌లకు అపరిమిత కాలింగ్‌తో, రీఛార్జ్ ప్లాన్ సంవత్సరానికి మొత్తం 3600 SMSలను అందిస్తుంది. ఈ ప్లాన్ లో ఎయిర్‌టెల్ సంవత్సరానికి 30GB డేటాను అందిస్తుంది. ఇది నెలకు దాదాపు 2.5GB వరకు వస్తుంది. ఇది ప్రధానంగా Wi-Fiపై ఆధారపడే లేదా చాలా ప్రాథమిక బ్రౌజింగ్, మెసేజింగ్ యాప్‌లు, అవసరమైన పనుల కోసం మాత్రమే మొబైల్ ఇంటర్నెట్ అవసరమయ్యే వినియోగదారులకు ఈ ప్లాన్ ఉత్తమం అని చెప్పొచ్చు. ఈ రీఛార్జ్ కు ప్రధాన ఆకర్షణ ఏమిటంటే, పెర్ప్లెక్సిటీ ప్రోకు ఒక సంవత్సరం ఉచిత సబ్‌స్క్రిప్షన్ అందిస్తుంది.
