Royal Airforce: విమానాలు సాధారణంగా శుద్ధమైన ప్రత్యేక పెట్రోల్‌తో నడుస్తాయి. దీనిని విమాన ఇంధనమని పిలుస్తారు. ఉక్రెయిన్-రష్యా యుద్దం కారణంగా ధరలు భారీగా పెరగడంతో వంట నూనెల పేరు వింటేనే జనం జంకే పరిస్థితి. వంట నూనెల ధరలు ఆకాశాన్నంటుతున్న వేళ.. విమానయాన రంగంలో సంచలన మలుపుగా వంట నూనెతో నడిచిన విమానం ఆకాశంలోకి ఎగురుతోంది. ఈ ఘనతను బ్రిటన్ రాయల్ ఎయిర్‌ఫోర్స్ సాధించింది. సైనిక రవాణా విమానాన్ని నూరుశాతం సుస్థిర విమాన ఇంధనం (ఎస్‌ఏఎఫ్) సాయంతోనే నడిపించి సరికొత్త చరిత్ర సృష్టించింది. ఇలా ప్రయాణించిన విమానాల్లో ప్రపంచంలో ఇదే మొట్టమొదటిది కావడం గమనార్హం. సైనిక, పౌర విమాన సేవలకు ఎస్‌ఏఎఫ్‌ను వాడుకోవటానికిది మార్గం సుగమం చేసింది.
విమాన ఇంధనంలో ఉన్న శక్తితో విమాన ప్రయాణాలు సాధ్యమవుతున్నాయి. కానీ ఈ ఇంధనంతో కార్బన్ డై ఆక్సైడ్ ఎక్కువగా వాతావరణంలో కలుస్తుంది. ఈ క్రమంలో విమాన ఇంధనానికి ప్రత్యామ్నాయం అన్వేషించడం తప్పనిసరి అయింది. ఈ క్రమంలోనే సస్టెయినబుల్ ఏవియేషన్ ఫ్యూయెల్(సుస్థిర విమాన ఇంధనం) ఆలోచన పుట్టుకొచ్చింది. ఎన్నో పెట్రోలు కంపెనీలు దీన్ని తయారు చేయటంపై దృష్టి సారించాయి. 2050 కల్లా కర్బన ఉద్గారాలను పూర్తిగా తగ్గించటం దీని ఉద్దేశం. సాధారణంగా పెట్రోల్, డీజిల్ వంటివ శిలాజ ఇంధనాలు కాగా.. వీటిని భూగర్భంలోంచి తవ్వి తీస్తారు. కానీ సుస్థిర విమానం ఇంధనం మాత్రం అందుకు భిన్నంగా అది ఓ బయో ఇంధనం. వాడగా మిగిలిన వంట నూనెలు, ఆహార వ్యర్థాల నుంచి తయారు చేస్తారు.
Mandous : మొదలైన మాండుస్ బీభత్సం.. భారీ వర్షం.. తీర ప్రాంతాల్లో అలర్ట్..
ఇది సాధారణ విమాన ఇంధనం కన్నా తక్కువ కార్బన్‌ను విడుదల చేస్తుంది. విమాన ఇంధనంతో పోలిస్తే కర్బన ఉద్గారాల చట్రాన్ని సుమారు 80 శాతం వరకు తగ్గిస్తుంది. సుస్థిర విమాన ఇంధనాన్ని రకరకాల పదార్థాలు, వ్యర్థాలతో తయారు చేస్తారు. గృహ, కార్యాలయ వ్యర్థాలతో పాటు సెల్యులోజ్ వ్యర్థాలు, వాడిన నూనెలు, క్యామెలీనా, జట్రోపా నుంచి ఆ ఇంధనాన్ని తయారు చేస్తారు. రసాయనిక, భౌతిక గుణాల పరంగా సుస్థిర, సంప్రదాయ విమాన ఇంధనాలు దాదాపు ఒకేలా ఉంటాయి. అంటే వీటిని కలిపినా నష్టమేమీ ఉండదన్న మాట. చక్కగా వాడుకోవచ్చు. ప్రస్తుతం వినియోగిస్తున్న విమానాలను సాంకేతికంగా మార్చకుండానే ఈ ఇంధనాన్ని ఉపయోగించుకోవచ్చు.