Site icon NTV Telugu

Air Turbulence: గాల్లో కలిసిపోగల జాగ్రత్త.. విమానాలపై తాజా నివేదికలో సంచలన విషయాలు..

Air Turbulence

Air Turbulence

Air Turbulence: ఇకపై విమానాల్లో ప్రయాణించే సమయంలో జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఏ చిన్న తేడా వచ్చిన ప్రాణాలు గాల్లోనే కలిసిపోతాయి. ఇది నిజం అండీ బాబు.. యునైటెడ్ కింగ్‌డమ్‌లోని రీడింగ్ విశ్వవిద్యాలయ పరిశోధకులు చేసిన అధ్యాయనంలో వెలుగుచూసిన విషయాలు ప్రపంచాన్ని షాక్‌కు గురి చేశాయి. ఇకపై ఎప్పుడైనా ఆకాశంలో ఉన్న విమానం ఒక్కసారిగా చేప పిల్లలాగ గిలగిలలాడుతుందని ఈ పరిశోధకులు వారి అధ్యాయనంలో కనుగొన్నారు. ఇంతకీ ఎందుకు ఇలా జరుగుతుంది, ఒక వేళ విమానం అకస్మాత్తుగా ఆకాశంలో చేపలాగా ఊగడం ప్రారంభిస్తే ఏంటి పరిస్థితి అనేది ఈస్టోరీలో తెలుసుకుందాం..

READ ALSO: Chiranjeevi – Allu Arjun : పాడె మోసిన చిరంజీవి, అల్లు అర్జున్

భూమి వేడెక్కడంతో అస్థిర గాలులు..
భూమి వేడెక్కడం వల్ల భవిష్యత్తులో విమానాలు మరింత అస్థిర గాలులను ఎదుర్కోవలసి రావచ్చని తాజాగా యునైటెడ్ కింగ్‌డమ్‌లోని రీడింగ్ విశ్వవిద్యాలయ పరిశోధకులు చేసిన అధ్యాయనంలో వెలుగుచూసినట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీని కారణంగా అల్లకల్లోల సంఘటనలు నిరంతరం పెరుగుతున్నాయన్నారు. విశ్వవిద్యాలయ పరిశోధకులు ఈ అధ్యయనంలో వాతావరణ మార్పుల కారణంగా అధిక ఎత్తులో ఉన్న జెట్ అస్థిరతకు కారణమవుతుందని కనుగొన్నారు. భూమి చుట్టూ అధిక ఎత్తులో వీచే వేగవంతమైన గాలులు జెట్‌లను అల్లకల్లోలం చేస్తాయని చెప్పారు. ఈసందర్భంగా పరిశోధకులు మాట్లాడుతూ.. గాలులలో మార్పులు విమాన ప్రయాణాన్ని మరింత ప్రమాదకరంగా మారుస్తాయి. 1979 – 2020 మధ్య సీనియర్ టర్బులెన్స్ సంఘటనలు దాదాపు 55 శాతం పెరిగాయని అన్నారు. తాజాగా జర్నల్ ఆఫ్ ది అట్మాస్ఫియరిక్ సైన్సెస్‌లో ప్రచురించిన కొత్త అధ్యయనం అంచనా ప్రకారం 2015 – 2100 మధ్య జెట్ స్ట్రీమ్‌లలో గాలి పీడనం 16 నుంచి 27 శాతం పెరుగుతుందని పేర్కొన్నారు. అలాగే వాతావరణం 10 నుంచి 20 శాతం తక్కువ స్థిరంగా మారవచ్చని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ మార్పును ఉత్తర – దక్షిణ అర్ధగోళాలలో స్పష్టంగా చూడవచ్చన్నారు.

రాడార్‌లో కనిపించని అల్లకల్లోలాలు..
తాజా అధ్యయనం ప్రధాన రచయిత, రీడింగ్ విశ్వవిద్యాలయంలో పీహెచ్‌డీ పరిశోధకురాలు జోవన్నా మెడెయిరోస్ మాట్లాడుతూ.. పెరుగుతున్న వాయు పీడనం, వాతావరణం స్థిరత్వం తగ్గడం కలిసి ‘క్లియర్-ఎయిర్ టర్బులెన్స్’ (CAT) కు అనుకూలమైన పరిస్థితులను సృష్టిస్తాయని అన్నారు. ఇది అకస్మాత్తుగా అల్లకల్లోల పరిస్థితి, ఎటువంటి హెచ్చరిక లేకుండా విమానాన్ని కదిలించగలదని చెప్పారు. తుఫానుల వల్ల కలిగే అల్లకల్లోలం రాడార్‌లో కనిపిస్తుంది, కానీ స్పష్టమైన-గాలి అల్లకల్లోలం కనిపించదని అన్నారు. అటువంటి పరిస్థితిలో పైలట్‌లు దీనిని నివారించడం చాలా కష్టమని చెప్పారు. తాము 26 ప్రపంచ వాతావరణ నమూనాలను ఉపయోగించి ఈ అధ్యయనం చేసినట్లు పేర్కొన్నారు. తమ అధ్యయనంలో వాతావరణ మార్పుల కారణంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు విమానాలు సాధారణంగా ఎగురుతున్న ఎత్తుపై అత్యధిక ప్రభావాన్ని చూపుతున్నాయని వెల్లడైనట్లు తెలిపారు. ఇటీవల కాలంలో ఈ ప్రమాదాల కారణంగా చాలా మంది ప్రయాణీకులకు తీవ్రమైన గాయాలు, కొన్ని సందర్భాల్లో విషాదకరమైన మరణాలకు సంభవించాయని యూనివర్శిటీ ఆఫ్ రీడింగ్‌లోని వాతావరణ శాస్త్ర ప్రొఫెసర్, సహ రచయిత పాల్ విలియమ్స్ చెప్పారు.

READ ALSO: Piyush Goyal: భారత్ ఎవరికీ తలవంచదు.. అమెరికా సుంకాల వేళ కీలక ప్రకటన..

Exit mobile version