Jet Fuel : రెండు నెలల్లో 10శాతం తగ్గిన జెట్ ఇంధనం రేటు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jet Fuel : జూలై నుండి అక్టోబర్ వరకు వరుసగా నాలుగు నెలల పాటు జెట్ ఇంధనం భారీగా పెరిగింది. ఎయిర్ టర్బైన్ ఇంధనాన్ని చమురు కంపెనీలు వరుసగా రెండవ నెల కూడా తగ్గించడంతో ఎయిర్‌లైన్ కంపెనీలకు ఉపశమనం లభించింది. జెట్ ఇంధనం ధరను మొదట నవంబర్‌లో తగ్గించి, ఆపై డిసెంబర్లో తగ్గించారు. నవంబర్ నెలలో, దేశ రాజధానిలో జెట్ ఇంధనం ధర ఐదున్నర శాతం కంటే తక్కువ తగ్గింది. డిసెంబర్ నెలలో 4.5 శాతానికి పైగా తగ్గుదల ఉంది. దీని కారణంగా రాజధాని ఢిల్లీలో జెట్ ఇంధనం ధర 10 శాతానికి పైగా తగ్గింది. అంటే విమాన కంపెనీలకు ఖరీదైన ఇంధనం నుంచి ఉపశమనం లభించనుంది. దీని వల్ల కంపెనీల నిర్వహణ ఖర్చులు తగ్గుతాయి. దీని ప్రయోజనాన్ని సాధారణ విమాన ప్రయాణికులు చౌక టిక్కెట్ల రూపంలో పొందవచ్చు. దేశ రాజధాని ఢిల్లీలో జెట్ ఇంధనం ధర ఎంతలా ఉందో తెలుసుకుందాం.
Read Also:Whatsapp: వాట్సాప్‌లో మరో ఫీచర్.. మెసేజ్ లను షెడ్యూల్ చేసి పంపొచ్చు..
Also Read
- Glenn Phillips: వరుసగా మూడు మ్యాచ్‌లు ఓడిపోయాం.. ఈ సారి ప్లాన్ మార్చాం.. విజయం వచ్చేసింది..
- OTR: ఎన్నికల వేళ సీపీఎంకు కొత్త చిక్కులు.. తెరపైకి హ*త్య కేసు..!
- OTR: సుభాష్ రెడ్డి పేరు వింటేనే ఉలిక్కిపడుతున్న గులాబీ నేతలు.. అసలు సంగతేంటి
- Israel Elections: యూదుల గడ్డపై అరబ్ పార్టీల హవా.. నెతన్యాహూకు షాక్.!
దేశ రాజధాని ఢిల్లీలో జెట్ ఇంధనం ధరలో 10 శాతానికి పైగా క్షీణత కనిపించింది. ప్రస్తుతం రాజధాని ఢిల్లీలో ఏటీఎఫ్ ధర కిలోలీటర్‌కు రూ.1,06,155.67గా మారింది. నవంబర్ నెలలో ఇదే ధర 1,11,344.92 కిలోలీటర్లు. అంటే నవంబర్‌తో పోలిస్తే ఢిల్లీలో తగ్గింపు 4.66 శాతం అంటే కిలోమీటరుకు రూ. 5,189.25. అక్టోబర్ నెలలో ఢిల్లీలో ఏటీఎఫ్ ధర కిలోమీటరుకు రూ.1,18,199.17గా ఉంది. రెండు నెలల్లో ఈ తగ్గుదల 10.18 శాతానికి అంటే కిలోలీటర్‌కు రూ.12,043.5కి చేరింది.
Read Also:Gold Price Today : పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు.. తులం ఎంతంటే?
వరుసగా రెండు నెలల కోత విధించకముందే, రాజధాని ఢిల్లీలో వరుసగా నాలుగు నెలలపాటు జెట్ ఇంధనం ధర పెరిగింది. చివరిసారిగా అక్టోబర్ 1న కిలోలీటర్‌కు రూ. 5,779.84 లేదా 5.1 శాతం చొప్పున పెంచారు. అంతకుముందు, ATF ధరలు సెప్టెంబర్ 1న అత్యంత వేగంగా 14.1 శాతం (కిలోలీటర్‌కు రూ. 13,911.07), ఆగస్టు 1న కిలోలీటర్‌కు 8.5 శాతం లేదా రూ. 7,728.38 చొప్పున పెరిగాయి. జూలై 1న ATF ధర కిలోలీటర్‌కు 1.65 శాతం లేదా రూ.1,476.79 పెరిగింది. నాలుగు పెరుగుదలలలో ATF ధరలు కిలోలీటర్‌కు రికార్డు స్థాయిలో రూ.29,391.08 పెరిగాయి. విమానయాన సంస్థ నిర్వహణ ఖర్చుల్లో 40 శాతం వాటా కలిగిన జెట్ ఇంధన ధరలను శుక్రవారం తగ్గించడం వల్ల ఇప్పటికే ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న విమానయాన సంస్థలపై భారం తగ్గనుంది.
తాజావార్తలు
-
Free MRI Scans : ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచిత ఎంఆర్ఐ.. సర్కారు కీలక నిర్ణయం.!
-
Glenn Phillips: వరుసగా మూడు మ్యాచ్‌లు ఓడిపోయాం.. ఈ సారి ప్లాన్ మార్చాం.. విజయం వచ్చేసింది..
-
Story Board : తుఫాన్ వెళ్లిపోయింది.. కష్టాలు మిగిలిపోయాయి!
-
OTR: జనసేనకు కేటాయించిన సీటులో టీడీపీ అభ్యర్థి.. చీపురుపల్లిలో ఏం జరుగుతోంది..?
-
OTR: ఎన్నికల వేళ సీపీఎంకు కొత్త చిక్కులు.. తెరపైకి హ*త్య కేసు..!
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!