NTV Telugu Site icon

Air pollution: భారత్ లో భారీగా ఎయిర్ పొల్యుషన్.. హైద‌రాబాద్ లో శ్వాస సంబంధ కేసులు

Air Pollusion

Air Pollusion

రోజు రోజుకు పెరిగిపోతున్న వాయు కాలుష్యం మానవ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. గాలిలో నాణ్యతా ప్రమాణాలు దారుణంగా పడిపోవడంతో పరిస్థితులు దుర్భరంగా మారుతున్నాయి. దేశ జనాభాలో 76.8 శాతం మంది శ్యాస కోస సంబంధిత వ్యాధుల బారిన పడుతున్నాట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. కాలుష్య కారకాలు ప్రధానంగా పీఎం 2.5 ప్రాణాంతక రకంగా చెప్పొచ్చు.. ఎందుకంటే అది చిన్న పరిమాణంలో ఉంటడంతో మానవ శరీర కణజాలాలలోకి లోతుగా దూసుకుపోతుంది అని తెలిపారు.

Read Also: Tamilisai: పెద్ద పెద్ద మాటల కంటే.. చిన్న చిన్న పనులు గొప్పవి

ఇక, హైద‌రాబాద్ నగరంలో గాలి కాలుష్యం క్రమంగా పెరుగుతుంది. దీని కార‌ణంగా ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. దీంతో పాటు శ్వాస సంబంధిత కేసులు అధికంగా నమోదు అవుతున్నట్లు వైద్య నివేదిక‌లు పేర్కొంటున్నాయి. ఇటీవలి కాలంలో వాయు కాలుష్య స్థాయిలు పెరగడంతో పాటు రద్దీగా ఉండే ప్రదేశాల్లో నివసించే ప్రజలు న్యుమోనియా బారిన పడుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. పీహెచ్ఎఫ్ఐ, హెచ్ఎంఈ సహకారంతో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ చేసిన అధ్యయనాన్ని కేంద్ర మంత్రి బఘేల్ లోక్ సభలో ప్రస్తావించారు.

Read Also: Viral Video :వార్నీ.. ఈ కుక్క మామూల్దీ కాదు బ్రో.. వీడియో చూస్తే నవ్వాగదు..

ఇక హైద‌రాబాద్ నగరంలో ఆగస్టు మొదటి వారంలో తాజా పీసీబీ డేటా ప్రకారం, 31 స్టేషన్లలో 15 స్టేషన్లలో 60 మైక్రోగ్రాముల కంటే ఎక్కువగా పీఎం10 స్థాయిలు న‌మోద‌య్యాయి. కోకాపేట పీఎం స్టేషన్ లో పీఎం 2.5 స్థాయిలు 40 కంటే ఎక్కువగా ఉన్నాయి. జీవ ద్రవ్యాన్ని కాల్చడం వల్ల వెలువడే గృహ వాయు కాలుష్యం శ్వాసకోశ వ్యాధులకు ప్రధాన కారణమనీ, దీనిపై జాగ్రత్తగా ఉండాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

Read Also: Bhagwanth Khuba: భారతదేశాన్ని విశ్వగురు అవ్వకుండా ఎవరూ ఆపలేరు..

వాయుకాలుష్యంలోని అన్ని భాగాల్లోని ధూళికణాలు వాయుమార్గాలు, ఊపిరితిత్తుల్లోకి ప్రవేశించి ఆస్తమా, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, క్యాన్సర్ లాంటి సీఓపీడీ, ఊపిరితిత్తుల సమస్యలకు కారణమవుతాయని డాక్టర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా గుండెపోటు వచ్చే చాన్స్ ఎక్కువగా ఉంటాయన్నారు. వాయు కాలుష్యానికి గురైనప్పుడు గర్భిణులు నెలలు నిండకుండానే ప్రసవించారని పలు అధ్యయనాల్లో తేలిందని డాక్టర్లు తెలియజేస్తున్నారు.

Read Also: Gill-Rohit: అది నేను చేయలేను.. నీకేమైనా పిచ్చి పట్టిందా?! గిల్‌పై రోహిత్ ఫైర్

సీవోపీడీ కేసులు 20 శాతం పెరిగాయనీ, ధూమపానం చేయని వారిపై కూడా దీని ప్రభావం ఉంటుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ధూమపానంతో సంబంధంలేని ఊపిరితిత్తుల క్యాన్సర్ తో బాధపడే వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతోంది. కఠినమైన నిబంధనలు, క్రమం తప్పకుండా కాలుష్య తనిఖీలు చేయడం, వాహన ఉద్గారాల స్థాయిలు పరిమితిని దాటకుండా చూసుకోవడం గాలి కాలుష్య నియంత్రణకు హెల్ప్ చేస్తుందన్నారు.