NTV Telugu Site icon

Air India: భారీగా విమానాలను కొననున్న ఎయిర్ ఇండియా

Air India: చరిత్రలోనే అతిపెద్ద డీల్ కుదుర్చుకోనుంది ఎయిర్ ఇండియా. త్వరలోనే సంస్థ 500కొత్త విమానాలు కొనుగోలు చేయనున్నట్లు తెలుస్తోంది. తన సేవలను మరింత విస్తృతం చేసే కార్యాచరణలో భాగంగా సుమారు 500 జెట్ లైనర్ విమానాలను కొనుగోలు చేయాలని ఎయిరిండియా భావిస్తోంది. ఈ విమానాలను బోయింగ్, ఎయిర్ బస్ సంస్థల నుంచి కొనుగోలు చేయనుంది. అందుకోసం రూ.80 వేల కోట్లను ఖర్చు చేయనున్నట్టు తెలుస్తోంది. మీడియా నివేదికల ప్రకారం ఇప్పటివరకూ ఎయిర్‌బస్, బోయింగ్ ఈ డీల్ విషయంలో స్పష్టమైన సమాచారం లభించలేదు. టాటా గ్రూప్ తరపున నుంచి కూడా ఏ విధమైన ప్రకటన లేదు. కొత్తగా కొనుగోలు చేసే విమానాల్లో 400 విమానాలు తక్కువ సీటింగ్ కలిగిన విమానాలు కాగా, మరో 100 విమానాలు భారీ సైజువి కొనుగోలు చేయనుంది. ఈ భారీ విమానాల్లో ఎయిర్ బస్ కు చెందిన ఏ350 విమానాలతో బోయింగ్ సంస్థకు చెందిన 787, 777 విమానాలు కొనుగోలు చేయనుంది. ఈ మహా కొనుగోలు ఒప్పందం త్వరలోనే కార్యరూపం దాల్చనుందని విమానయాన రంగం వర్గాలు తెలిపాయి.

Show comments