NTV Telugu Site icon

Air India Pilot: నా డ్యూటీ అయిపోయింది.. విమానం నడపనని వెళ్లిపోయిన పైలెట్! ముగ్గురు బీజేపీ ఎంపీల పడిగాపులు

Air India Plane

Air India Plane

Air India pilot refused to fly at Rajkot Airport: ఢిల్లీకి వెళ్లే ఎయిరిండియా విమానానికి ఊహించని అంతరాయం ఏర్పడటంతో ముగ్గురు బీజేపీ ఎంపీలతో సహా 100 మంది ప్రయాణికులు గుజరాత్‌లోని రాజ్‌కోట్ విమానాశ్రయంలో పడిగాపులు కాస్తూ ఉండిపోయారు. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) నిబంధనల ప్రకారం విమాన పైలట్ తన డ్యూటీ అయిపోయిందని వెళ్లిపోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది. జూలై 23న రాత్రి 8.30 గంటలకు టేకాఫ్ కావాల్సిన ఎయిరిండియా విమానంలో ప్రయాణికులు ఎక్కిన తర్వాత ఈ ఘటన జరిగింది.

ఆదివారం రాత్రి రాజ్‌కోట్‌ నుంచి ఢిల్లీ వెళ్లాల్సిన విమానం (ఏఐ404)లో ప్రయాణించేందుకు రాజ్‌కోట్ ఎంపీ మోహన్ కుందారియా, జామ్‌నగర్ ఎంపీ పూనమ్ మాదం, కొత్తగా ఎన్నికైన రాజ్యసభ ఎంపీ కేసరిదేవ్‌సింగ్ ఝాలా ముగ్గురు రాజకీయ నాయకులు సహా 100 మంది ఉన్నారు. ఈ విమానం రాజ్‌కోట్‌ నుంచి ఢిల్లీకి 7.30 గంటలకు బయలుదేరాల్సి ఉంది. అయితే అది రాజ్‌కోట్‌లో దిగేసరికే రాత్రి 8.30 అయింది. ఆ పైలట్‌ విమానం నడపనని వెళ్లిపోవడం, వేరే పైలట్‌ లేకపోవడంతో.. ప్రయాణికులందరూ 2 గంటల పాటు నిరీక్షించారు. చివరకు అధికారులు సర్వీసును రద్దు చేశారు.

ఈ ఘటనపై ఎయిర్ ఇండియా సంస్థ ఓ ప్రకటన విడుదల చేసింది. జూలై 23 రాజ్‌కోట్ మరియు ఢిల్లీ మధ్య నడిచే AI404 విమానం కార్యాచరణ కారణాల వల్ల ఆలస్యం అయిందని పేర్కొంది. కాక్‌పిట్ సిబ్బంది ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిట్ (ఎఫ్‌డీటీఎల్) నిబంధనల క్రిందకు వచ్చారని, రెగ్యులేటరీ నిబంధనల ప్రకారం వారు విమానాన్ని నడపలేరని ఎయిర్ ఇండియా ప్రతినిధి చెప్పారు. ఇక కొంతమంది ప్రయాణికులను కార్లలో అహ్మదాబాద్‌కు, అక్కడ నుంచి వేరే విమానంలో ఢిల్లీకి పంపింది. మరికొందరికి హోటల్ రూమ్స్ బుక్‌ చేసింది.

Also Read: MS Dhoni: వైరల్ అవుతున్న ధోని అపాయింట్‌మెంట్ లెట‌ర్.. జీతం ఎంతో తెలుసా?

Also Read: India vs Pakistan: వన్డే ప్రపంచకప్ 2023.. భారత్ vs పాకిస్తాన్ మ్యాచ్ రీ-షెడ్యూల్! కారణం ఏంటంటే?

Show comments