NTV Telugu Site icon

Visakhapatnam: విశాఖలో చిక్కుకున్న ఎయిరిండియా ఫ్లైట్.. NTV కథనానికి స్పందన

Air India

Air India

ఢిల్లీ నుంచి పోర్ట్‌ బ్లైర్‌ వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానం విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్‌లో అత్యవసరంగా ల్యాండ్‌ అయ్యింది.. వాతావరణం అనుకూలించని కారణంగా.. విశాఖలో నిన్న రాత్రి ఎమర్జెన్సీగా ల్యాండ్‌ చేశారు పైలట్.. దీంతో.. ప్రయాణికులకు నిన్న రాత్రి ఒక హోటల్ లో వసతి ఏర్పాటు చేశారు.. విమానం అత్యవసరంగా ల్యాండ్‌ అయిన నేపథ్యంలో.. పోర్ట్‌ బ్లైర్‌ వెళ్లాల్సిన 270 మంది ప్రయాణికులు విశాఖపట్నంలోనే ఉండిపోవాల్సి వచ్చింది.

Read Also: Bhaag Saale: కీరవాణి కొడుకు సినిమాలో ఎన్టీఆర్, చరణ్… థియేటర్స్ లో నవ్వులే

దీంతో ప్రయాణికుల ఇబ్బందులపై వరుసగా ప్రసారం చేసిన NTV కథనానికి ఎయిర్ ఇండియా అధికారులు స్పందించారు. విశాఖలో ఎయిర్ ఇండియా విమానం ఎమర్జెన్సీ ల్యాండ్ అవ్వడంతో నిన్నటి నుంచి ఇబ్బంది పడిన సుమారు 270 మంది ప్రయాణికుల ఇబ్బందుల్ని కళ్ళకి కట్టినట్లు NTV న్యూస్ ఛానెల్ చూపించింది. దీంతో మేఘాలయ హోటల్ నుంచి ప్యాసింజర్స్ ను ఎయిర్ పోర్ట్ కు తరలించారు. NTV కథనాన్ని చూసిన ఎయిర్ ఇండియా అధికారులు వెంటనే స్పందించి మొదట విడతగా 80 మందికి మధ్యాహ్నం 01:30 గంటలకి స్పెషల్ విమానంలో పోర్టు బ్లైర్ కి తరలించారు. మిగతావారిని నెక్స్ట్ ఫ్లైట్ లో పంపించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

Read Also: Gold and Silver Price: 25 నిమిషాల్లోనే వెయ్యి పెరిగిన వెండి ధర.. 70వేలు దాటిన సిల్వర్..!