Site icon NTV Telugu

Air India: ప్రయాణికుడి మృతికి కారణమైన ఎయిరిండియాకు భారీ జరిమానా

Air

Air

ముంబై ఎయిర్‌పోర్టులో ( Mumbai) ప్రయాణికుడి మృతికి కారణమైన కేసులో ఎయిరిండియాకు (Air India) భారీ షాక్‌ తగిలింది. రూ.30లక్షలు జరిమానా విధిస్తూ డైరెక్టరేట్‌ జనరల్‌ ఆప్‌ సివిల్‌ ఏవియేషన్‌(డీజీసీఏ) గురువారం ఆ విమానయాన సంస్థపై చర్యలు తీసుకుంది.

ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో విమానం దిగిన తర్వాత 80 ఏళ్ల ప్రయాణికుడికి వీల్‌చైర్ (Wheelchair Dies) ఏర్పాటు చేయకపోవడంతో.. అతడు తన భార్య సహాయంతో టెర్మినల్‌కు నడుచుకుంటూ వచ్చేశాడు. దీంతో ఆయాసం రావడంతో అక్కడినే కుప్పకూలిపోయాడు. ఆస్పత్రికి తరలించే లోపే ప్రాణాలు విడిచారు. ఈ ఘటన ఫిబ్రవరి 16న జరిగింది.

దీన్ని సీరియస్‌గా తీసుకున్న డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) షోకాజ్ నోటీసు జారీ చేసింది. ఏడు రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. ఎయిరిండియా సమాధానం తర్వాత డీజీసీఏ దోషిగా నిర్ధారించి రూ.30 లక్షల ఫైన్ విధించింది.

 

వివరణ..

ఇదిలా ఉంటే ప్రయాణికుడి భార్యకు వీల్‌చైర్ అందించామని, మరొకటి ఏర్పాటు చేసే వరకు వేచి ఉండమని సిబ్బంది కోరారని ఎయిర్‌లైన్ తెలిపింది. కానీ అంతలోనే అతను తన భార్య సహాయంతో టెర్మినల్‌కు వెళ్లిపోయారని ఎయిరిండియా పేర్కొంది. వీల్‌చైర్లకు విపరీతమైన డిమాండ్ ఉండడం వల్లే వేచి ఉండమని చెప్పినట్లు పేర్కొంది.

కానీ ఎయిరిండియా వివరణను డీజీసీఏ పరిగణనలోకి తీసుకోలేదు. ఎయిర్‌క్రాఫ్ట్ రూల్స్‌కు ఇది విరుద్ధమని.. నిబంధనలకు కట్టుబడి ఉండడంలో వైఫల్యం కారణంగా ఎయిర్‌లైన్స్‌కు భారీ జరిమానా విధించింది.

Exit mobile version