NTV Telugu Site icon

Air India Express: మరీ ఇంత కరువులో ఉన్నారేంట్రా బాబు.. నాలుగు గంటల్లో 15 లీటర్ల మందు తాగేసిన ప్రయాణికులు

Air India

Air India

Air India Express: గుజరాత్‌లోని సూరత్ నుంచి థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్‌కు ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ మొదటి విమానాన్ని శుక్రవారం ప్రారంభించింది. ఈ పూర్తిగా బుక్ అయిన ఫ్లైట్ సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చకు దారితీసింది. ప్రయాణికులు తమ అనుభవాలను వీడియోల రూపంలో పంచుకోవడంతో ఈ ప్రయాణం మరింత వైరల్ గా మారింది. దీనికి కారణం ఈ ప్రయాణంలో ప్రయాణికులు అధిక మద్యం వినియోగించడమే ఇందుకు కారణం. విమానంలో ప్రయాణికులు దాదాపు 15 లీటర్ల ప్రీమియమ్ మద్యం, అందులో చివాస్ రిగల్, బకార్డీ, బీర్ వంటి పానీయాలను కలిపి దాదాపు రూ. 1.8 లక్షల విలువైన మద్యం వినియోగించినట్లు నివేదికలు వెల్లడించాయి. ప్రయాణికుల మద్యం వినియోగం ఎక్కువగా ఉండటంతో బ్యాంకాక్‌కు చేరుకునే ముందునే మద్యం అయిపోయిందని విమాన సిబ్బంది ప్రకటించాల్సి వచ్చింది.

Also Read: MP Chamala Kiran: రియల్ హీరో అనుకున్నాం కానీ.. రీల్ హీరో లాగానే వ్యవహరించారు..

ఈ ప్రయాణంలో ప్రయాణికుల కోసం తీసుకుని వచ్చిన గుజరాతీ వంటకాలు ముఖ్యంగా థెప్లా, ఖమన్ వంటి ఐటెంలు, అలాగే పిజ్జా వంటి ఇతర భోజనాలు అందరినీ ఆకర్షించాయి. ఇవి విమానంలో అందించిన ఫుడ్, డ్రింక్స్‌కు చక్కటి కాంబినేషన్ గా నిలిచాయి. మొత్తం మీద 4 గంటల ప్రయాణంలో ఈ భోజనాలు పూర్తిగా అయిపోయాయి. అయితే, ఈ విమానంపై వచ్చిన మొదటి నివేదికలలో కొన్ని వివరాలపై సామాజిక మాధ్యమాల్లో ప్రశ్నలు లేవనెత్తబడ్డాయి. ముఖ్యంగా, 300 మంది ప్రయాణికుల సంఖ్యపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఒక యూజర్ ఈ విషయంపై వ్యాఖ్యానిస్తూ.. ఈ విమానం, ఎయిర్‌బస్ లేదా బోయింగ్ 737 అని అభిప్రాయపడ్డాడు. నిజానికి ఈ ఫ్లైట్ లో 300 మందిని తీసుకెళ్లలేరు. గరిష్ఠ సామర్థ్యం సుమారు 176 మంది మాత్రమే. ఆ సంఖ్యకు సరిపోల్చితే, ప్రతి ప్రయాణికుడికి సగటున 85 మిల్లీలీటర్ల మద్యం పడిందని తెలిపాడు.

Also Read: OTT Platforms : ఆ 18 ఓటీటీలు బ్యాన్.. కారణం ఇదే !

ఈ సంఘటన గుజరాత్ నిషేధ విధానంపై కొత్త చర్చలను తెరపైకి తీసుకువచ్చింది. ఒక సామాజిక మాధ్యమ యూజర్ వ్యాఖ్యానిస్తూ, ఇది గుజరాత్ ప్రజలు మద్యం వినియోగానికి ఆసక్తి చూపిస్తున్నట్లు స్పష్టం చేస్తోందని, నిషేధాన్ని మరోసారి ఆలోచించాలని అంటున్నారు. నియంత్రిత మద్యం అమ్మకాల ద్వారా ఆదాయం పొందడాన్ని పరిగణనలోకి తీసుకోవడం అవసరమని కామెంట్ చేస్తున్నారు. నిషేధం ఉన్నప్పటికీ, రాష్ట్రంలో అక్రమ మద్యం వ్యాపారం జరుగుతుందని చూడగలుగుతున్నామని పేర్కొన్నారు.

Show comments