NTV Telugu Site icon

Bomb Threat: ఎయిర్ ఇండియా విమానంకు బాంబు బెదిరింపు.. విమానంలో 189 మంది ప్రయాణికులు

Air India

Air India

Bomb Threat: విమానంలో బాంబు బెదిరింపు రావడంతో జైపూర్ విమానాశ్రయంలో ఎయిర్ ఇండియా విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. శుక్రవారం రాత్రి ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ఫ్లైట్ IX 196 లో బాంబు ఉన్నట్లు అర్ధరాత్రి 12.45 గంటలకు ఇమెయిల్ ద్వారా బాంబు బెదిరింపు వచ్చింది. దాంతో దుబాయ్ నుంచి జైపూర్ వస్తున్న విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేశారు. దుబాయ్ నుంచి జైపూర్‌కు అర్ధరాత్రి 12:45 గంటలకు వస్తున్న అంతర్జాతీయ విమానానికి బాంబు బెదిరింపు రావడంతో విమానాశ్రయంలో భద్రతా ఏర్పాట్లను పటిష్టం చేశారు.

Read Also: Eluru Hospital: ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రిలో దారుణం.. మృతదేహాన్ని మాయం చేసేందుకు యత్నం..

ఈ విమానం దుబాయ్ నుంచి అర్ధరాత్రి సమయం1:20 గంటలకు జైపూర్ చేరుకుంది. అత్యవసర పరిస్థితుల్లో దాని ల్యాండింగ్ జరిగింది. విమాన ప్రయాణంలో మొత్తం 189 మంది ప్రయాణికులు ఉన్నారు. ల్యాండ్ అయిన తర్వాత భద్రతా బలగాలు విమానాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అయితే, దర్యాప్తులో విమానంలో క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాత అనుమానాస్పదంగా ఏమీ కనుగొనబడలేదని అధికారులు తెలిపారు. గత కొన్ని రోజులుగా జైపూర్ విమానాశ్రయానికి వచ్చే విమానాల్లో బాంబుల బెదిరింపులు కొనసాగుతున్నాయి. జైపూర్‌కు అనుసంధానించబడిన రెండు విమానాలు సహా దేశవ్యాప్తంగా అనేక విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. విమానంలో బాంబు పెట్టినట్లు సోషల్ మీడియా ద్వారా బెదిరింపులు వచ్చాయి.

Read Also: IND vs NZ: చరిత్ర సృష్టించిన టీమిండియా.. 147 ఏళ్ల టెస్ట్ క్రికెట్‌లో ఇదే మొదటిసారి!

Show comments