NTV Telugu Site icon

AP Singh: వైమానిక దళం 25% కంటే ఎక్కువ అగ్నివీర్లను పర్మినెంట్ చేయగలదు కానీ…

Ap Singh

Ap Singh

భారత వైమానిక దళం 25% కంటే ఎక్కువ అగ్నివీర్లను పర్మినెంట్ చేయగలదు. అయితే దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. ప్రస్తుతం, అగ్నిపథ్ స్కీమ్ కింద ప్రతి బ్యాచ్ అగ్నివీర్‌లలో గరిష్టంగా 25% మాత్రమే శాశ్వతంగా మారే అవకాశం ఉందని వాయుసేన చీఫ్, ఎయిర్ మార్షల్ అమర్‌ ప్రీత్ సింగ్ అన్నారు. మనం 25% కంటే ఎక్కువ అగ్నివీర్లను తీసుకోవాలని కేంద్రం మాకు సూచిస్తే తప్పకుండా తీసుకుంటామన్నారు. అగ్నివీర్‌కు సంబంధించి మూడు సర్వీసుల నుంచి డీఎమ్‌ఏ ఫీడ్‌బ్యాక్ కోరింది. 25% అగ్నివీర్‌ను శాశ్వతంగా చేయడం వల్ల వైమానిక దళం అవసరాలు తీరుతాయా? అనే ప్రశ్నలపై ఏపీ సింగ్ సమాధానమిస్తూ.. ప్రజలతో మాట్లాడిన తర్వాత అగ్నివీర్ ఫీడ్‌బ్యాక్ చాలా సానుకూలంగా ఉందని విశ్వసించారు.

READ MORE: Deputy CM Pawan Kalyan: సుప్రీంకోర్టు తీర్పుపై స్పందించిన పవన్‌.. కీలక వ్యాఖ్యలు

ఢిల్లీ మాజీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ సోషల్ మీడియా పోస్ట్‌లో ఓ ప్రశ్న సంధించారు. ‘దళం సిద్ధంగా ఉన్నప్పుడు, అవసరమైనప్పుడు, కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఎక్కువ మంది అగ్నివీరులను పర్మినెంట్ చేయదు’ అని రాశారు. ? ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇదిలా ఉండగా.. మూడేళ్లుగా అగ్నివీర్ వాయు నియామకం చేస్తున్నామని ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ తెలిపారు. రిక్రూట్ అయిన మొదటి బ్యాచ్ రెండో దశ శిక్షణ కూడా పూర్తి చేసుకుందన్నారు. పురోగతి చాలా బాగుందని స్పష్టం చేశారు. చైతన్యవంతులని, యంగ్ మైండెడ్‌గా, పూర్తి శక్తితో, సులభంగా శిక్షణ పొందుతారని తెలిపారు. సాయుధ దళాల కోసం ప్రభుత్వం చేసిన విధానాలపై ముందుకు సాగుతామని ఎయిర్ ఫోర్స్ చీఫ్ చెప్పారు.