Flight charges: విమాన చార్జీలకు రెక్కలు.. కారణమిదే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఓ వైపు ఎండలు మండిపోతున్నాయి. ఇంకోవైపు ప్రయాణికులు పెరిగారు. దీంతో అదును చూసి ధరలు పెంచేశాయి విమాన సంస్థలు. ఒక్కసారిగా విమాన చార్జీలకు రెక్కలొచ్చాయి. ఎండలు మండిపోతున్నట్లుగానే ఫ్లైట్ చార్జీలు కూడా అమాంతంగా పెరిగిపోయాయి. విస్తారా ఎయిర్‌లైన్స్ సర్వీసుల రద్దుతో పాటు వేసవి కావడంతో చార్జీలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. దాదాపుగా ఆయా మార్గాల్లో 20 నుంచి 25 శాతం వరకు ధరలు పెరిగిపోయాయి. విమానయాన సేవలకు డిమాండ్ పెరగడంతో ధరలు పెరిగిపోయాయని పరిశ్రమ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఇది కూడా చదవండి: Pakistan: పాక్ ఆర్థిక రాజధానిని ఆక్రమించిన బిచ్చగాళ్లు!
Also Read
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
పైలట్ల సంక్షోభం కారణంగా విస్తారా రోజుకు 25-30 విమాన సర్వీసులు లేదా రోజువారీ షెడ్యూలులో 10 శాతం సర్వీసులను తగ్గించుకుంది. దివాలా తీసిన గోఫస్ట్ ఎయిర్‌లైన్స్ గతంలోనే సేవలను నిలిపివేయడంతో పాటు ఇంజన్ సమస్యల కార ణంగా ఇండిగోకు చెందిన 70 విమానాలు మూలనపడటంతో పరిశ్రమ సేవల సామర్థ్యం ఇప్పటికే తగ్గింది. దీనికి విస్తారా పైలట్ల సంక్షోభం తోడై ఈ సమస్య మరింత ముదిరింది.
ఇది కూడా చదవండి: Nitish Reddy IPL 2024: పంజాబ్‌పై విధ్వంసం సృష్టించిన తెలుగు ఆటగాడు.. ఎవరీ నితీష్ రెడ్డి?
ఈనెల 1-7 తేదీల్లో కొన్ని దేశీయ మార్గాల్లో విమాన సర్వీసుల స్పాట్ చార్జీలు గత నెల ఇదే కాలంతో పోలిస్తే 39 శాతం వరకు పెరిగాయి. గత వారం ఢిల్లీ-బెంగళూరు సర్వీసు స్పాట్ టికెట్ రేటు 39 శాతం పెరగగా.. ఢిల్లీ-శ్రీనగర్ చార్జీ 30 శాతం, ఢిల్లీ-ముంబై చార్జి 12 శాతం, ముంబై-ఢిల్లీ రూట్లో 8 శాతం పెరిగాయి. దేశీయ, అంతర్జాతీయ మార్గాల్లో కలిపి ఎయిర్ టికెట్ చార్జీల పెరుగుదల 20-25 శాతంగా ఉండవచ్చని ప్రముఖ ట్రావెల్ పోర్టల్ యాత్రా. కామ్ ఎయిర్ అండ్ హోటల్ బిజినెస్ విభాగం సీనియర్ వైస్ ప్రెసిడెంట్ భరత్ మాలిక్ అన్నారు. విస్తారా సర్వీసుల రద్దు కీలక దేశీయ మార్గాల్లో విమాన చార్జీలపై గణనీయ ప్రభావం చూపిందన్నారు. ఢిల్లీ నుంచి గోవా, కొచి, జమ్ము, శ్రీనగర్‌కు నడిచే విమానాలకు అధిక డిమాండ్ నెలకొనడంతో ఈ మార్గాల్లో టికెట్ ధరలు అధికంగా పెరిగాయన్నారు.
ఇది కూడా చదవండి: TS TET: నేటితో ముగియనున్న టెట్ దరఖాస్తుల గడువు..
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!