Site icon NTV Telugu

Flight charges: విమాన చార్జీలకు రెక్కలు.. కారణమిదే!

Flite

Flite

ఓ వైపు ఎండలు మండిపోతున్నాయి. ఇంకోవైపు ప్రయాణికులు పెరిగారు. దీంతో అదును చూసి ధరలు పెంచేశాయి విమాన సంస్థలు. ఒక్కసారిగా విమాన చార్జీలకు రెక్కలొచ్చాయి. ఎండలు మండిపోతున్నట్లుగానే ఫ్లైట్ చార్జీలు కూడా అమాంతంగా పెరిగిపోయాయి. విస్తారా ఎయిర్‌లైన్స్‌ సర్వీసుల రద్దుతో పాటు వేసవి కావడంతో చార్జీలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. దాదాపుగా ఆయా మార్గాల్లో 20 నుంచి 25 శాతం వరకు ధరలు పెరిగిపోయాయి. విమానయాన సేవలకు డిమాండ్‌ పెరగడంతో ధరలు పెరిగిపోయాయని పరిశ్రమ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఇది కూడా చదవండి: Pakistan: పాక్ ఆర్థిక రాజధానిని ఆక్రమించిన బిచ్చగాళ్లు!

పైలట్ల సంక్షోభం కారణంగా విస్తారా రోజుకు 25-30 విమాన సర్వీసులు లేదా రోజువారీ షెడ్యూలులో 10 శాతం సర్వీసులను తగ్గించుకుంది. దివాలా తీసిన గోఫస్ట్‌ ఎయిర్‌లైన్స్‌ గతంలోనే సేవలను నిలిపివేయడంతో పాటు ఇంజన్‌ సమస్యల కార ణంగా ఇండిగోకు చెందిన 70 విమానాలు మూలనపడటంతో పరిశ్రమ సేవల సామర్థ్యం ఇప్పటికే తగ్గింది. దీనికి విస్తారా పైలట్ల సంక్షోభం తోడై ఈ సమస్య మరింత ముదిరింది.

ఇది కూడా చదవండి: Nitish Reddy IPL 2024: పంజాబ్‌పై విధ్వంసం సృష్టించిన తెలుగు ఆటగాడు.. ఎవరీ నితీష్‌ రెడ్డి?

ఈనెల 1-7 తేదీల్లో కొన్ని దేశీయ మార్గాల్లో విమాన సర్వీసుల స్పాట్‌ చార్జీలు గత నెల ఇదే కాలంతో పోలిస్తే 39 శాతం వరకు పెరిగాయి. గత వారం ఢిల్లీ-బెంగళూరు సర్వీసు స్పాట్‌ టికెట్‌ రేటు 39 శాతం పెరగగా.. ఢిల్లీ-శ్రీనగర్‌ చార్జీ 30 శాతం, ఢిల్లీ-ముంబై చార్జి 12 శాతం, ముంబై-ఢిల్లీ రూట్లో 8 శాతం పెరిగాయి. దేశీయ, అంతర్జాతీయ మార్గాల్లో కలిపి ఎయిర్‌ టికెట్‌ చార్జీల పెరుగుదల 20-25 శాతంగా ఉండవచ్చని ప్రముఖ ట్రావెల్‌ పోర్టల్‌ యాత్రా. కామ్‌ ఎయిర్‌ అండ్‌ హోటల్‌ బిజినెస్‌ విభాగం సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ భరత్‌ మాలిక్‌ అన్నారు. విస్తారా సర్వీసుల రద్దు కీలక దేశీయ మార్గాల్లో విమాన చార్జీలపై గణనీయ ప్రభావం చూపిందన్నారు. ఢిల్లీ నుంచి గోవా, కొచి, జమ్ము, శ్రీనగర్‌కు నడిచే విమానాలకు అధిక డిమాండ్‌ నెలకొనడంతో ఈ మార్గాల్లో టికెట్‌ ధరలు అధికంగా పెరిగాయన్నారు.

ఇది కూడా చదవండి: TS TET: నేటితో ముగియనున్న టెట్‌ దరఖాస్తుల గడువు..

Exit mobile version