Site icon NTV Telugu

Canada flight: విమానానికి తప్పిన పెను ప్రమాదం.. గాల్లో ఉండగా మంటలు

Flite

Flite

ఎయిర్‌ కెనడాకు భారీ ప్రమాదం తప్పింది. ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అధికారులతో పాటు ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఎయిర్‌ కెనడాకు చెందిన బోయింగ్‌ ఏసీ 872 విమానం జూన్‌ 5న కెనడాలోని టొరంటో పియర్సన్‌ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి టేకాఫ్‌ అవుతుండగా విమానంలో కుడివైపు ఇంజిన్‌లో పేలుడు సంభవించింది. దీంతో ఒక్కసారిగా పెద్దగా మంటలు కనిపించాయి. పేలుడు జరగగానే విమానం రెక్కల దగ్గర మంటలు చెలరేగాయి. చాకచక్యంగా వ్యవహరించిన పైలట్‌లు గాల్లోకి లేచిన 30 నిమిసాల్లోనే విమానాన్ని పియర్సన్‌ విమానాశ్రయంలో సేఫ్‌గా ల్యాండింగ్ చేశారు. దీంతో విమానం పెద్ద ప్రమాదం నుంచి బయటపడింది. పేలుడు జరిగి మంటలంటుకున్న సమయంలో విమానంలో ప్రయాణికులు, సిబ్బంది కలిపి 400 మంది దాకా ఉన్నారు. అందరూ క్షేమంగా బయటపడ్డారు. ప్రమాదం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇదిలా ఉంటే ఘటన జరిగినపుడు విమానంలో ఇంధన ట్యాంకులు పూర్తిగా నిండి ఉన్నాయి. మరోపక్క వాతావరణం కూడా అనుకూలంగా లేదు. ఇన్ని ప్రతికూలతల మధ్య విమానాన్ని సురక్షితంగా వెనకకు మళ్లించి ల్యాండ్‌ చేసిన పైలట్‌లను అందరూ అభినందించారు.
జూన్ 5 సాయంత్రం ఈ పేలుడు ప్రమాదం జరిగింది. విమానం పారిస్‌కు వెళ్తుండగా మంటలు అంటుకున్నాయి. విమానం రన్‌వేపై నుంచి పైకి లేచిన ముప్పై నిమిషాలకే ఈ ఘటన జరిగింది. విమానం రాత్రి 8:46 గంటలకు దాని స్థానం నుంచి బయలుదేరింది. తిరిగి టొరంటో పియర్సన్ విమానాశ్రయంలో రాత్రి 9:50 గంటలకు ల్యాండ్ చేశారు.

 

Exit mobile version