Site icon NTV Telugu

Rajastan: రాజస్థాన్ కాంగ్రెస్ నేతలతో ఏఐసీసీ కీలక సమావేశం

Congress

Congress

రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలకు హస్తం పార్టీ ప్లాన్ రెడీ చేస్తుంది. మరోసారి విజయం సాధించడం కోసం వ్యూహాలను రచించేందుకు ఆ రాష్ట్ర కాంగ్రెస్ నేతలతో ఆ పార్టీ అగ్ర నేతలు ఇవాళ( గురువారం) భేటీ అయ్యారు. సీఎం అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్ మధ్య సయోధ్య కుదిర్చేందుకు ప్రయత్నించారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, రాజస్థాన్ కాంగ్రెస్ ఇన్‌ఛార్జి సుఖ్‌జిందర్ రణధవా, ఆ రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ గోవింద్ సింగ్ తో పాటు పలువురు సీనియర్ నేతలు ఈ మీటింగ్ లో పాల్గొన్నారు. అశోక్ గెహ్లాట్ వర్చువల్ విధానంలో ఈ సమావేశానికి హాజరైనారు.

Also Read: MLA Vinay Bhaskar : చిత్తశుద్ధి ఉంటే విభజన హామీలను అమలు చేయండి

ఈ సంవత్సరం ఎన్నికలు జరిగే మధ్య ప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మిజోరాం రాష్ట్రాల కాంగ్రెస్ నేతలతో మల్లికార్జున ఖర్గే వరుసగా భేటీ అవుతున్నారు. ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం తగిన వ్యూహాలను రచిస్తున్నారు. అయితే.. రాజస్థాన్ లో సచిన్ పైలట్ కు.. సీఎం ఆశోక్ గెహ్లాట్ కు చాలా కాలం నుంచి వివాదాలు కొనసాగుతున్నాయి. బీజేపీ నేత వసుంధర రాజే సింథియా అవినీతిపై చర్యలు తీసుకోవాలని సచిన్ పైలెట్ డిమాండ్ చేశారు. అయితే.. సచిన్ పైలెట్, సీఎం గెహ్లాట్ మధ్య సయోధ్య కుదిర్చేందుకు మే నెలలో మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ వీరితో చర్చలు జరిపారు. రానున్న శాసన సభ ఎన్నికలను సమైక్యంగా ఎదుర్కొనేందుకు వీరిద్దరూ అంగీకరించినట్లు కాంగ్రెస్ ప్రకటించింది.

Also Read: Botsa Satyanarayana: హోటల్ రంగాన్ని ఇండస్ట్రియల్ రంగంగా గుర్తిస్తాం.. క్వాలిటీ ముఖ్యం

ఇరువురి సమస్యల పరిష్కార బాధ్యతను పార్టీ హై కమాండ్‌కు వదిలిపెట్టినట్లు వారు తెలిపారు. 2018లో రాజస్థాన్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి గెహ్లాట్, సచిన్ పైలట్ మధ్య వివాదాలు కొనసాగుతున్నాయి. సీఎం పదవి కోసం పైలట్ గట్టిగా ట్రై చేశాడు.. ఇక, 2020లో తిరుగుబాటు చేయడంతో పైలట్‌ను డిప్యూటీ సీఎం పదవి నుంచి, రాజస్థాన్ కాంగ్రెస్ చీఫ్ పదవి నుంచి తొలగించింది. మరి చూడాలి ఈ ఇద్దరు నేతలు ఎంత మేరకు కలిసి పార్టీ గెలుపు కోసం కృషి చేస్తారు అనేది.

Exit mobile version