రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం చివరి అంకానికి చేరుకుండటంతో అన్ని పార్టీలు ప్రచారంలో స్పీడ్ పెంచాయి. దీంతో ఇవాళ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తెలంగాణ రాష్ట్రంలో జరిగే ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి హెలికాప్టర్‌లో అలంపూర్ కు వెళ్లి.. అక్కడ ఏర్పాటు చేసిన కాంగ్రెస్ నిర్వహిస్తున్న విజయభేరి బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. ఇక, సాయంత్రం 4 గంటలకు నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ ఏర్పాటు చేసిన ప్రచార సభలో ఆయన మాట్లాడనున్నారు. ఈ పర్యటన తర్వాత రాత్రికి ప్రత్యేక విమానంలో బేగంపేట ఎయిర్ పోర్ట్ నుంచి ఢిల్లీకి తిరిగివెళ్తారు.
Read Also: North Korea : గూఢచారి ఉపగ్రహాన్ని ప్రయోగించిన ఉత్తర కొరియా
అయితే, నిన్న ( మంగళవారం ) సాయంత్రం బేగంపేట విమానాశ్రయానికి ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున చేరుకున్నారు. ఖర్గేకు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇన్‌ఛార్జి మాణిక్‌రావ్ ఠాక్రే, కర్ణాటక మంత్రి బోసురాజు, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తదితరులు స్వాగతం పలికారు. మరో వైపు తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తమిళనాడు సీఎం, డీఎంకే అధినేత స్టాలిన్ మద్దతు ప్రకటించారు. ఈ మేరకు డీఎంకే అధికారిక ప్రకటన రిలీజ్ చేసింది. కాంగ్రెస్ అభ్యర్థులకు సపోర్టుగా నిలవాలని తెలంగాణలోని డీఎంకే శ్రేణులకు, మద్దతుదారులకు స్టాలిన్ పిలుపునిచ్చారు. ఇక, స్టాలిన్‌కు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కృతజ్ఞతలు తెలిపింది.