Site icon NTV Telugu

AI Refrigerator: అయ్యబాబోయ్.. ఈ కొత్త ఏఐ టెక్నాలజీ ఫ్రిడ్జ్ లో ఇన్ని విశేషాలా..!

12

12

ప్రస్తుతం ప్రపంచం మొత్తం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ తో దూసుకెళ్తోంది. సాఫ్ట్వేర్ పరంగా ఎన్నో రకాల అద్భుతాలను సృష్టిస్తోంది ఈ కొత్త టెక్నాలజీ. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ఉపయోగించుకుని అతి తక్కువ సమయంలో ఎక్కువ మంది చేసే పనిని చాలా సులువుగా చేసేస్తుంది. దీంతో ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ టెక్నాలజీతో అనేక కొత్త ఆవిష్కరణలు వస్తున్నాయి. ఇందులో భాగంగానే తాజాగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ను ఉపయోగించుకొని శాంసంగ్ కంపెనీ కొత్త రిఫ్రిజిరేటర్ ను విడుదల చేసింది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు చూస్తే..

Also read: Congress Manifesto 2024: కాంగ్రెస్‌ మేనిఫెస్టో విడుదల.. సంక్షేమ పథకాలతో పాటు 25 గ్యారంటీలు!

రోజు రోజుకి టెక్నాలజీ మారుతున్న కారణంగా అందులో భాగంగానే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ తో అనేక పనులు స్మార్ట్ పద్ధతిలో చకచగా జరిగిపోతున్నాయి. తాజాగా శాంసంగ్ కంపెనీ ఏఐ టెక్నాలజీతో పనిచేసే రిఫ్రిడ్జ్ ను తయారు చేసి ఏప్రిల్ 3న మార్కెట్లోకి తీసుకోవచ్చింది. ఇకపోతే ఈ ఫ్రిడ్జ్ ఎలా పనిచేస్తుంది ఎలాంటి ఫీచర్స్ కలిగిందో ఒకసారి చూద్దాం.. మామూలు రిఫ్రిజిరేటర్ లో ఏమైనా సరుకులు తెచ్చి పెట్టి వాడుకోవడం కామన్. అయితే ఈ రిఫ్రిజిరేటర్ లో మీరు ఏవైనా సరుకులు తెచ్చి పెడితే అవి ఎంత ఉన్నాయి..? వాటిని ఉపయోగించి ఎలాంటి పదార్థాలను వండుకోవచ్చు, అవి ఎప్పుడు చెడిపోతాయి అన్న పూర్తి వివరాలను ఫ్రిడ్జ్ పై ఉన్న స్క్రీన్ పై చూపెడుతుంది.

Also read: Viral Video: ఇదేంది భయ్యా.. చిప్స్ ప్యాకెట్స్ అంటే ఇష్టమని.. మరి ఇంతలా కార్ డెకరేషనా..?!

అంతేకాకుండా ఎవరైనా కొత్తవారు ఈ ఫ్రిడ్జ్ లో నుంచి ఏదైనా వస్తువును తీసుకున్నప్పుడు హెచ్చరికలు జారీ చేస్తుంది. మీరు ఫ్రిడ్జ్ లో ఆహారాన్ని ఎప్పుడు పెడుతున్నారు ఎప్పుడు తీస్తున్నారన్న వివరాలను పూర్తిగా నోట్ చేస్తుంది. ఒక వేళ ఈ రిఫ్రిజిరేటర్ మీ ఫోన్ ను కనెక్ట్ చేసుకున్న సమయంలో ఒకవేళ మీ ఫోన్ కు కాల్ వస్తే ఫ్రిడ్జ్ దానిని రిసీవ్ చేసుకోగలదు. అంతకాకుండా అవసరమైనప్పుడు వంటగదిలో మ్యూజిక్ ప్లే కూడా చేస్తుంది. అలాగే డోర్ బెల్ ఎవరు ఉపయోగిస్తున్నారన్న విషయాన్ని కూడా ఫ్రిడ్జ్ చూపిస్తుంది. అవసరమైతే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ఫ్రిడ్జ్ సూపర్ మార్కెట్ నుంచి వస్తువులను కూడా ఆర్డర్ చేయగలుగుతుంది. ముఖ్యంగా మనకు అవసరమైన వస్తువులు ఉన్నాయో లేదో అన్న విషయాన్ని కచ్చితంగా తెలుపుతుంది. దీంతో మనకు కావాల్సిన వస్తువులను సరైన సమయానికి కొనుగోలు చేసి వాడుకోవచ్చు. ఇక్కడ ఇంకో ఆసక్తికర విషయం ఏమిటంటే.. లోపలున్న పదార్థాలతో ఎలాంటి కొత్త వంటకాలు తయారు చేయవచ్చు కూడా తెలుపుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ కొత్త రిఫ్రిజిరేటర్ ను ఇంటికి తెచ్చుకోండి.

Exit mobile version