Site icon NTV Telugu

AI Artificial Anchor: ఏఐ మరో సంచలనం.. వార్తలు చదువుతోన్న కృత్రిమ మహిళా

Ai Artificial Anchor

Ai Artificial Anchor

కృత్రిమ మేధస్సు రోజురోజుకూ చాలా అభివృద్ధి చెందుతోంది. ప్రస్తుతం అన్ని రంగాల్లో దాన్ని అభివద్ధి చేస్తున్నారు. భారతీయ సంప్రదాయ చీరకట్టుతో టీవీ స్క్రీన్ మీద కనిపిస్తూ చక్కగా వార్తలు చదువుతున్న యాంకర్ నిజంగా మనిషి కాదు.. కృత్రిమ మేధస్సు (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) తో తయారు చేసిన బొమ్మ అని తెలిసి జనం ఆశ్చర్యానికి గురవుతున్నారు. మహిళా యాంకర్ ను తలపించేలా స్పీడ్ గా న్యూస్ చదివిన లీసా తీరు ఒడిశా ప్రజలను ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఒడిశాలో పేరొందిన న్యూస్ ఛానల్ ఓ టీవీ ఈ సరికొత్త యాంకర్ ను నిన్న (ఆదివారం) తన వీక్షకులకు పరిచయం చేసింది. ఒడిశాలో తొలి ఏఐ యాంకర్ లిసాతో వార్తలు చదివించింది.

Read Also: Puvvada Ajay Kumar : కొంతమంది సన్నాసులు ఏవేవో మాట్లాడుతున్నారు

ఒడియాతో పాటు ఇంగ్లిష్ లోనూ లీసా వార్తలు చదివేలా ప్రోగ్రామ్ చేసినట్లు ఓ టీవీ మేనేజింగ్ డైరెక్టర్ జాగి మంగత్ పాండా వెల్లడించారు. రాష్ట్రానికి మొట్ట మొదటి ఏఐ యాంకర్ ను పరిచయం చేసిన ఘనత తమకే దక్కుతుందని ఆమె తెలిపారు. లీసాకు బహు భాషలు మాట్లాడగల సామర్థ్యం ఉన్నప్పటికీ ప్రస్తుతం ఒరియా, ఇంగ్లిష్ వార్తలపైనే తాము దృష్టి పెట్టామని ఆ ఛానెల్ ఎండీ చెప్పారు. టీవీ బ్రాడ్ కాస్టింగ్ రంగంలో ఏఐ వాడకం ఇప్పుడిప్పుడే మొదలైందని, భవిష్యత్తులో మరిన్ని మైలురాళ్లను చేరుకుంటుందని పాండా పేర్కొన్నారు.

Read Also: BiggBossTelugu7: బ్రేకింగ్.. బిగ్ బాస్ సీజన్ 7 ప్రోమో వచ్చేసింది.. హోస్ట్ ఎవరంటే.. ?

ఈ మేరకు లిసా ఆవిష్కరణ కార్యక్రమం భువనేశ్వర్‌లో జరిగింది. టీవీ జర్నలిజంలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏఐ న్యూస్‌ యాంకర్‌ను పరిచయం చేశామని ఎండీ జగి మంగత్‌ పాండా తెలిపారు. రాష్ట్రంలో ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఒడియాలో లిసాకు శిక్షణ ఇవ్వడం చాలా కష్టమైన పని.. అయినప్పటికీ మేం దాన్ని సాధించాం.. మనుషులు మాట్లాడేంత స్పష్టంగా ఉచ్చారణ లేకపోయినా.. గూగుల్‌ అసిస్టెంట్‌ కంటే మెరుగ్గానే ఉంటుంది.. త్వరలోనే ఇతరులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పే విధంగా తయారు చేస్తామని జాగి మంగత్ పాండా అన్నారు.

Exit mobile version