Elon Musk : ఏడాదికేడాదికి టెక్నాలజీ అభివృద్ధి చెందుతోంది. గత 10 ఏళ్ల క్రితం ఉన్న టెక్నాలజీకి.. గత 5 ఏళ్ల నాటి టెక్నాలజీకి.. నేటి టెక్నాలజీకి ఎంతో తేడా ఉంది. ప్రతి ఏడాది టెక్నాలజీలో కొత్త ధనం వస్తూనే ఉంది. అందులో భాగంగా బ్లాక్ చైన్ నుంచి ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్(ఏఐ) స్థాయికి ఎదిగాం. ఇక ఇప్పుడు ఏఐ సృష్టిస్తున్న అద్భుతాలు అన్నీ.. ఇన్నీ కావు. ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ రంగంలో ఏఐ సాంకేతికంగా విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది. చాట్ జీపీటీకి ముందు.. ఆ తర్వాత అనే స్థాయిలో మనిషి జీవితంపై ఏఐ ప్రభావం చూపుతోంది. టెక్నాలజీ రంగంలోనే కాదు.. ఆర్టిస్ట్‌ల ఊహా శక్తికీ ఏఐ రెక్కలు తొడుగుతోంది. ఏఐ టెక్నాలజీ జనాలకు సరికొత్త అవతారాలను పరిచయం చేస్తోంది.
Read Also: Ashish Vidyarthi : ఆశిష్ విద్యార్ధి మరో పెళ్లి చేసుకోవడానికి కారణం అదేనా..?
ప్రపంచంలోనే అత్యంత కుబేరులు పేదవారు(బికారులు)గా మారితే ఎలా ఉంటారు.. స్టార్ క్రికెటర్లు, స్టార్ హీరోలు అమ్మాయిలైతే ఎలా ఉంటారో ఊహిస్తూ ఏఐ సాయంతో రూపొందించిన చిత్రాలు ఇప్పటికే నెట్టింట వైరలైన విషయం చూసిఉన్నాం. ఇప్పుడు తాజాగా ప్రపంచ కుబేరుల్లో ఒకరైన ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్క్ దేశీయ వరుడుగా అయితే ఎలా ఉంటాడో.. వెడ్డింగ్ ఫొటోగ్రాఫర్, ఏఐ ఆర్టిస్ట్ కళ్లకు కట్టినట్టు చూపించారు.ఫొటోల్లో మస్క్ సంప్రదాయ దుస్తులు ధరించి గుర్రంపై ఊరేగుతున్నట్లు కనిపించారు. మరికొన్ని ఫొటోల్లో అయితే నవ్వుతూ, వేడుకను ఎంజాయ్ చేస్తున్నట్లు కనిపించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. వీటిని చూసిన నెటిజన్లు.. అద్భుతం.. నమ్మలేకపోతున్నాం.. అంటూ కామెంట్లు పెడుతూ ఎంజాయ్ చేస్తున్నారు.