NTV Telugu Site icon

Crime: ఏఐ సహాయంతో హత్య కేసు ఛేదించిన ఢిల్లీ పోలీసులు

Delhi

Delhi

ఢిల్లీ హత్య కేసు మిస్టరీని ఛేదించేందుకు పోలీసులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సహాయం తీసుకున్నారు. AI వినియోగం బాధితుడిని గుర్తించడంలో సహాయపడటమే కాకుండా హత్యకు కారణమైన ప్రధాన నిందితుడిని అరెస్టు చేసేందుకు హెల్ప్ చేసింది. అయితే, జనవరి 10న తూర్పు ఢిల్లీలోని గీతా కాలనీ ఫ్లైఓవర్ కింద ఓ యువకుడి మృతదేహం లభ్యమైంది. అతడ్ని గొంతు నులిమి చంపినట్లు పోస్ట్ మార్టంలో తేలింది. అయినప్పటికీ మృతదేహంపై లేదా చుట్టుపక్కల ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో పోలీసులకు సవాలుగా మారింది.

Read Also: India vs England Match: 29 వరకు ఆ రూట్లో వెళ్లకండి.. వెళ్లారో బుక్కైనట్టే

యువకుడిని గుర్తించలేని స్థితిలో ఉండటంతో పోలీసులు ఈ కేసును ఛేదించేందుకు అత్యాధునిక టెక్నాలజీ సాయం తీసుకున్నారు. AI సహాయంతో బాధితుడి ముఖాన్ని పునర్నిర్మించారు. దీంట్లో దాదాపు 500 వైర్షన్ లలో పోస్టర్లను తయారు చేసి వాటిని దేశ రాజధానిలోని వివిధ ప్రదేశాలలో అంటించారు. అలాగే, వాట్సాప్ గ్రూపుల ద్వారా వైరల్ చేశారు. ఇక, ఈ పోస్టర్‌లో ఉన్న వ్యక్తి తన అన్నయ్య హితేంద్ర అని పేర్కొంటూ ఒక వ్యక్తి పోలీసు స్టేషన్ కు రావడంతో అతడ్ని ఆరా తీయగా.. హితేంద్ర ముగ్గురు వ్యక్తులతో వాగ్వాదానికి దిగారు.. ఆ ముగ్గురు వ్యక్తులు ఆయన్ని గొంతుకోసి చంపి సాక్ష్యాలను దాచడానికి ఒక మహిళ సహాయం తీసుకున్నారు అని పోలీసుల విచారణ తెలిపాడు. ఈ సమాచారంతో పోలీసులు వెంటనే మహిళతో సహా నలుగురిని అరెస్టు చేశారు.