Site icon NTV Telugu

Ahmed Shehzad: “భారత్‌ను చూసి బుద్ధి తెచ్చుకోండి”.. పాకిస్థాన్ మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు

Ahmed Shehzad

Ahmed Shehzad

Ahmed Shehzad: భారత్ చరిత్ర సృష్టించింది. మూడు సార్లు టీ20 వరల్డ్ కప్ కైవసం చేసుకున్న ఏకైక టీమ్‌గా హిస్టరీ సాధించింది. భారత్ గెలుపుతో పాకిస్థాన్ క్రికెట్‌లో ఒక్కసారిగా కలకలం మొదలైంది. భారత్‌కు కలసి రాదు అనుకున్న అహ్మదాబాద్ స్టేడియంలో న్యూజిలాండ్‌ను భారత్ చిత్తు చేయడంపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ అహ్మద్ షెహజాద్ స్పందించాడు. సొంత దేశం పాకిస్థాన్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశాడు. టీమిండియా విజయానికి భారత క్రికెట్‌లోని క్రమశిక్షణ, పటిష్టమైన వ్యవస్తే కారణం అంటూ సొంత దేశం క్రికెట్ బోర్డు, ప్లేయర్స్‌పై విమర్శలు గుప్పించాడు. భారత్‌ను చూసి బుద్ధి తెచ్చుకోవాలని సూచించాడు. ముఖ్యంగా సంజూ శామ్సన్, ఇషాన్ కిషన్ వంటి ఆటగాళ్లను చూసి పాకిస్థాన్ నేర్చుకోవాలని షెహజాద్ హితవు పలికాడు.

READ MORE: Best Mileage Bikes: తక్కువ బడ్జెట్‌లో సామాన్యుడికి బెస్ట్ ఆప్షన్స్.. ఎక్కువ మైలేజీ ఇచ్చే టాప్ 5 బైకుల లిస్ట్ ఇదిగో..!

భారత్ ఓ పద్ధతిగా వెళ్తోంది. జట్టులో చోటు కోసం పరితపించిన సంజూ ఏకంగా ప్లేయర్ ఆఫ్‌ ది టోర్నమెంట్‌గా నిలిచాడు. క్రమశిక్షణ లేదని పక్కన పెట్టిన ఇషాన్ కిషన్ గ్రేట్ కమ్‌బ్యాక్ ఇచ్చాడు. ఒత్తిడిలో ఉన్న ఓపెనర్ అభిషేక్ శర్మ ఫైనల్‌లో కేవలం 21 బంతుల్లోనే 52 పరుగులు స్కోర్ చేశాడని టీమిండియా ప్లేయర్స్ ప్రతిభను ప్రశంసించాడు. అంతేకాదు.. అహ్మద్ షెహజాద్ పాకిస్థాన్ ప్లేయర్స్‌పై సెటైర్లు వేశాడు. ఉగాండా, కెన్యా, జింబాబ్వే వంచి చిన్న జట్లపై గెలిచి సంబరాలు చేసుకుంటున్నారని విమర్శించాడు. భారత్ మాత్రం పెద్ద జట్లతో ఆడి గెలుస్తుందని తెలిపాడు. ఒక వేళ పాకిస్థాన్ ఫైనల్‌కు చేరి ఉంటే 180 పరుగులు చేసి బౌలర్లు కాపాడతారని ఆశించే వాళ్లం. కానీ.. టీమిండియా మాత్రం ఏకంగా 250 పరుగులకు స్కోర్ చేసి మ్యాచ్‌న వన్ సైడ్ చేసిందని భారత్ తెగువను గుర్తు చేశాడు. ఇక అహ్మద్‌కు చెందిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పాక్ అభిమానులు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు.

Exit mobile version