Ahmed Shehzad: “భారత్‌ను చూసి బుద్ధి తెచ్చుకోండి”.. పాకిస్థాన్ మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ahmed Shehzad: భారత్ చరిత్ర సృష్టించింది. మూడు సార్లు టీ20 వరల్డ్ కప్ కైవసం చేసుకున్న ఏకైక టీమ్‌గా హిస్టరీ సాధించింది. భారత్ గెలుపుతో పాకిస్థాన్ క్రికెట్లో ఒక్కసారిగా కలకలం మొదలైంది. భారత్‌కు కలసి రాదు అనుకున్న అహ్మదాబాద్ స్టేడియంలో న్యూజిలాండ్‌ను భారత్ చిత్తు చేయడంపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ అహ్మద్ షెహజాద్ స్పందించాడు. సొంత దేశం పాకిస్థాన్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశాడు. టీమిండియా విజయానికి భారత క్రికెట్లోని క్రమశిక్షణ, పటిష్టమైన వ్యవస్తే కారణం అంటూ సొంత దేశం క్రికెట్ బోర్డు, ప్లేయర్స్‌పై విమర్శలు గుప్పించాడు. భారత్‌ను చూసి బుద్ధి తెచ్చుకోవాలని సూచించాడు. ముఖ్యంగా సంజూ శామ్సన్, ఇషాన్ కిషన్ వంటి ఆటగాళ్లను చూసి పాకిస్థాన్ నేర్చుకోవాలని షెహజాద్ హితవు పలికాడు.
Also Read
- IT Minister Sridhar Babu: రాష్ట్రంలో ఐటీ ఉద్యోగాలకు బిగ్ బూస్ట్.. కొత్త GCC పాలసీపై ఐటీ మంత్రి కీలక ప్రకటన
- iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
- Jowar Roti to Ragi Roti: రొట్టెల్లో వెరైటీ కావాలా?.. జొన్న నుంచి రాగి వరకు.. ఆరోగ్యకరమైన 6 రకాల రొట్టెలు ఇవే!
- 80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?
భారత్ ఓ పద్ధతిగా వెళ్తోంది. జట్టులో చోటు కోసం పరితపించిన సంజూ ఏకంగా ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా నిలిచాడు. క్రమశిక్షణ లేదని పక్కన పెట్టిన ఇషాన్ కిషన్ గ్రేట్ కమ్‌బ్యాక్ ఇచ్చాడు. ఒత్తిడిలో ఉన్న ఓపెనర్ అభిషేక్ శర్మ ఫైనల్లో కేవలం 21 బంతుల్లోనే 52 పరుగులు స్కోర్ చేశాడని టీమిండియా ప్లేయర్స్ ప్రతిభను ప్రశంసించాడు. అంతేకాదు.. అహ్మద్ షెహజాద్ పాకిస్థాన్ ప్లేయర్స్‌పై సెటైర్లు వేశాడు. ఉగాండా, కెన్యా, జింబాబ్వే వంచి చిన్న జట్లపై గెలిచి సంబరాలు చేసుకుంటున్నారని విమర్శించాడు. భారత్ మాత్రం పెద్ద జట్లతో ఆడి గెలుస్తుందని తెలిపాడు. ఒక వేళ పాకిస్థాన్ ఫైనల్‌కు చేరి ఉంటే 180 పరుగులు చేసి బౌలర్లు కాపాడతారని ఆశించే వాళ్లం. కానీ.. టీమిండియా మాత్రం ఏకంగా 250 పరుగులకు స్కోర్ చేసి మ్యాచ్న వన్ సైడ్ చేసిందని భారత్ తెగువను గుర్తు చేశాడు. ఇక అహ్మద్‌కు చెందిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పాక్ అభిమానులు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు.
తాజావార్తలు
-
Bipasha Basu: ప్రొటీన్ పౌడర్‌లో పురుగులు.. ‘మీరే మా ఏకైక ఆశ’ అంటూ ఐఏఎస్ అధికారికి బిపాషా బసు ఫిర్యాదు!
-
IT Minister Sridhar Babu: రాష్ట్రంలో ఐటీ ఉద్యోగాలకు బిగ్ బూస్ట్.. కొత్త GCC పాలసీపై ఐటీ మంత్రి కీలక ప్రకటన
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
Jowar Roti to Ragi Roti: రొట్టెల్లో వెరైటీ కావాలా?.. జొన్న నుంచి రాగి వరకు.. ఆరోగ్యకరమైన 6 రకాల రొట్టెలు ఇవే!
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?
ట్రెండింగ్
-
Masala Gutti Vankaya Recipe: బగారా రైస్, పులావ్‌లోకి అదిరిపోయే “మసాలా గుత్తివంకాయ” చేసేయండి ఇలా..! లొట్టలేసుకుంటూ తినేస్తారంతే.!
-
7.62mm స్లిమ్ డిజైన్, 7,100mAh బ్యాటరీతో రానున్న Nubia NaviX Ultra..!
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!