NTV Telugu Site icon

Raj Tarun: ‘అహ నా పెళ్లంట’ అంటున్న రాజ్ తరుణ్ కానీ పెళ్లికూతురేమో..

Fgjgmdjauaa6iu8

Fgjgmdjauaa6iu8

Raj Tarun: హిట్ ప్లాపులతో సంబంధం లేకుండా చేతినిండా సినిమాలతో దూసుకుపోతున్నారు రాజ్ తరుణ్. సినీ ప‌రిశ్రమలో ప్రతిభ కంటే కూడా విజయాలకే పెద్దపీట వేస్తుంటారు. ఎవరి ఖాతాలో హిట్లుంటే వారినే అవకాశాలు వెతుక్కుంటూ వెళ్తుంటాయి. రెమ్యునరేషన్ పరంగా కూడా వారికి ఎక్కువ చెల్లిస్తుంటారు నిర్మాతలు. అలాంటి చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం చేతిలో అరకొర హిట్లు ఉన్నా అవకాశాలను భారీగా అందుకుంటున్న అతి కొద్దిమంది హీరోల్లో రాజ్ తరుణ్ ఒకరు. వచ్చిన కొత్తలో హ్యాట్రిక్ విజయాలు సాధించాడు. ఆ తర్వాత కెరీర్ ట్రాక్ తప్పింది.. నాలుగేళ్లలో ఖాతాలో సరైన హిట్ లేదు. పెట్టిన పెట్టుబడి కూడా తీసుకొచ్చిన సినిమా ఒక్కటీ లేదు.

Read Also: Vishal v/s Prakash Raj: విశాల్ ట్వీట్‎కు వ్యంగ్యంగా బదులిచ్చిన ప్రకాశ్ రాజ్

తాజాగా రాజ్ తరుణ్ న‌టించిన `అహ‌ నా పెళ్లంట‌` ఇప్పుడు విడుద‌ల‌కు రెడీగా ఉంది. జీ 5వారు ఈ వెబ్ సిరీస్ ను నిర్మించగా .. సంజీవ్ రెడ్డి దర్శకత్వం వహించాడు. నవంబర్ 17వ తేదీ నుంచి ఈ వెబ్ సిరీస్ ను స్ట్రీమింగ్ చేయనున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ అందుకు సంబంధించిన పోస్టర్ విడుదల చేశారు. రొమాంటిక్ కామెడీ జోనర్లో నడిచే ఈ కథ 8 ఎపిసోడ్స్ గా ప్రేక్షకులను పలకరించనుంది. ప్రేమకథలకు యూత్లో మంచి ఆధరణ ఉంది. ఆ ప్రేమ పెద్దల అనుమతి పొందడానికి ప్రయత్నిస్తే, వెంటనే అది ఫ్యామిలీ ఎంటర్టయినర్ గా మారుతుంది. ఇలాటి కథకి కాస్త కామెడీ తోడైతే ఆ కథ అన్ని తరగతుల ప్రేక్షకులను అలరిస్తుంది. అలాంటి ఒక కంటెంట్ తో రూపొందిన వెబ్ సిరీస్ పేరే ‘అహ నా పెళ్లంట’. ఇది పెళ్లి అనే క్లిష్టమైన అంశం చుట్టూ తిరిగే ప్రేమకథ అనే విషయం టైటిల్ ను బట్టే తెలిసిపోతోంది. రాజ్ తరుణ్ – శివాని రాజశేఖర్ జంటగా నటించిన ఈ వెబ్ సిరీస్ లో నరేశ్ .. ఆమని కీలక పాత్రలు పోషించారు. ఇతర పాత్రలలో పోసాని .. హార్షవర్ధన్ కనిపించనున్నారు. తన లైఫ్ లోకి ఏ అమ్మాయైనా అడుగుపెడితే ఏదో చెడు జరుగుతుందనే ఆలోచనతో పెరిగిన ఒక యువకుడి చుట్టూ తిరిగే కథ ఈ వెబ్ సిరీస్.

Show comments