Raj Tarun: ‘అహ నా పెళ్లంట’ అంటున్న రాజ్ తరుణ్ కానీ పెళ్లికూతురేమో..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Raj Tarun: హిట్ ప్లాపులతో సంబంధం లేకుండా చేతినిండా సినిమాలతో దూసుకుపోతున్నారు రాజ్ తరుణ్. సినీ పరిశ్రమలో ప్రతిభ కంటే కూడా విజయాలకే పెద్దపీట వేస్తుంటారు. ఎవరి ఖాతాలో హిట్లుంటే వారినే అవకాశాలు వెతుక్కుంటూ వెళ్తుంటాయి. రెమ్యునరేషన్ పరంగా కూడా వారికి ఎక్కువ చెల్లిస్తుంటారు నిర్మాతలు. అలాంటి చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం చేతిలో అరకొర హిట్లు ఉన్నా అవకాశాలను భారీగా అందుకుంటున్న అతి కొద్దిమంది హీరోల్లో రాజ్ తరుణ్ ఒకరు. వచ్చిన కొత్తలో హ్యాట్రిక్ విజయాలు సాధించాడు. ఆ తర్వాత కెరీర్ ట్రాక్ తప్పింది.. నాలుగేళ్లలో ఖాతాలో సరైన హిట్ లేదు. పెట్టిన పెట్టుబడి కూడా తీసుకొచ్చిన సినిమా ఒక్కటీ లేదు.
Read Also: Vishal v/s Prakash Raj: విశాల్ ట్వీట్‌కు వ్యంగ్యంగా బదులిచ్చిన ప్రకాశ్ రాజ్
Also Read
- CM Chandrababu: బుర్రిపాలెంలో కృష్ణ సినిమా హీరో.. పెమ్మసాని పొలిటికల్ హీరో!
- Shivraj Singh Chouhan: చంద్రబాబు నాయుడు డైనమిక్ లీడర్.. ఏపీ దేశంలోనే నంబర్ వన్ అవుతుంది!
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
- Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
తాజాగా రాజ్ తరుణ్ నటించిన `అహ నా పెళ్లంట` ఇప్పుడు విడుదలకు రెడీగా ఉంది. జీ 5వారు ఈ వెబ్ సిరీస్ ను నిర్మించగా .. సంజీవ్ రెడ్డి దర్శకత్వం వహించాడు. నవంబర్ 17వ తేదీ నుంచి ఈ వెబ్ సిరీస్ ను స్ట్రీమింగ్ చేయనున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ అందుకు సంబంధించిన పోస్టర్ విడుదల చేశారు. రొమాంటిక్ కామెడీ జోనర్లో నడిచే ఈ కథ 8 ఎపిసోడ్స్ గా ప్రేక్షకులను పలకరించనుంది. ప్రేమకథలకు యూత్లో మంచి ఆధరణ ఉంది. ఆ ప్రేమ పెద్దల అనుమతి పొందడానికి ప్రయత్నిస్తే, వెంటనే అది ఫ్యామిలీ ఎంటర్టయినర్ గా మారుతుంది. ఇలాటి కథకి కాస్త కామెడీ తోడైతే ఆ కథ అన్ని తరగతుల ప్రేక్షకులను అలరిస్తుంది. అలాంటి ఒక కంటెంట్ తో రూపొందిన వెబ్ సిరీస్ పేరే ‘అహ నా పెళ్లంట’. ఇది పెళ్లి అనే క్లిష్టమైన అంశం చుట్టూ తిరిగే ప్రేమకథ అనే విషయం టైటిల్ ను బట్టే తెలిసిపోతోంది. రాజ్ తరుణ్ – శివాని రాజశేఖర్ జంటగా నటించిన ఈ వెబ్ సిరీస్ లో నరేశ్ .. ఆమని కీలక పాత్రలు పోషించారు. ఇతర పాత్రలలో పోసాని .. హార్షవర్ధన్ కనిపించనున్నారు. తన లైఫ్ లోకి ఏ అమ్మాయైనా అడుగుపెడితే ఏదో చెడు జరుగుతుందనే ఆలోచనతో పెరిగిన ఒక యువకుడి చుట్టూ తిరిగే కథ ఈ వెబ్ సిరీస్.
తాజావార్తలు
-
Srikanth Odela: సుకుమార్ కోసం.. ఇండియాలోనే నెం.1 డైరెక్టర్ ఆఫర్‌కి ‘నో’ చెప్పిన శ్రీకాంత్ ఓదెల!
-
Matsya: పడవ కింద నుంచి వెళ్లిన ‘మిథికల్ ఫిష్’.. టాలీవుడ్లో మరో గ్రాండ్ విజువల్ వండర్ ‘మత్స్య’!
-
IndiGo : శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఇండిగో విమానానికి తప్పిన ప్రమాదం
-
CM Chandrababu: బుర్రిపాలెంలో కృష్ణ సినిమా హీరో.. పెమ్మసాని పొలిటికల్ హీరో!
-
Plague: ల్యాబ్ నుంచి మృత్యువు..! ఆ మహిళా ఎలా చనిపోయింది?
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!