Site icon NTV Telugu

Agra school: స్కూల్‌లోనే కొట్టుకున్న టీచర్-ప్రిన్సిపల్.. అసలేం జరిగిందంటే..!

Eel

Eel

గురువులంటే పది మందికి ఆదర్శంగా ఉండాలి. అలాంటిది ఈ మధ్య సభ్యత మరిచి ప్రవర్తిస్తున్నారు. కనీసం టీచర్లన్న ఇంగిత జ్ఞానం లేకుండా ప్రవర్తించి గౌరవాలను పోగొట్టుకుంటున్నారు. ఇటీవల ఉత్తరప్రదేశ్‌లోని పాఠశాలలో ప్రిన్సిపల్ ఫేషియల్ చేయించుకుంటుండగా టీచర్‌ మొబైల్‌లో చిత్రీకరిస్తుండగా ఆమెను కొట్టి చేతులు కొరికివేసింది. ఈ సంఘటనను మరువక ముందే ఆగ్రాలో మరో ఘటన వెలుగుచూసింది. ప్రిన్సిపల్-టీచర్ బూతులు తిట్టుకుంటూ కొట్టుకున్నారు. ఇద్దరి మధ్య ఏమైనా పగ ఉందో.. ఏమో తెలియదు గానీ.. బట్టలు చెరిగేలా కొట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

ఇది కూడా చదవండి: Uttarpradesh : రూ.50కోసం కన్న కొడుకుపై దారుణంగా దాడి చేసిన తండ్రి

టీచర్ ఆలస్యంగా వచ్చినందుకు ఆగ్రా స్కూల్ ప్రిన్సిపల్ గొడవకు దిగింది. అనంతరం ఆమెపై భౌతికదాడికి దిగింది. ఈ ఘర్షణలో ఇద్దరు వస్త్రాలు చిరిగిపోయాయి. అంతటితో ఆగకుండా నోటికి కూడా పని చెప్పారు. బూతులు తిట్టుకుంటూ కొట్టుకున్నారు. ప్రిన్సిపల్ డ్రైవర్ విడదీసే ప్రయత్నం చేసినా.. చివరికి టీచర్‌తో అసభ్యకరంగా ప్రవర్తించాడు.

ఇది కూడా చదవండి: Afternoon Sleep: మధ్యాహ్నం భోజనం చేశాక నిద్రపోతున్నారా? అయితే మీరు డేంజర్లో పడ్డట్లే..

ఆగ్రాలోని సీగానా గ్రామంలోని ప్రీ-సెకండరీ స్కూల్‌కు చెందిన టీచర్ గుంజన్ చౌదరి ఆలస్యంగా వచ్చింది. దీంతో ఆలస్యంగా వచ్చినందుకు ప్రిన్సిపల్ దాడికి తెగబడింది. ఆమె బట్టలను చించేసింది. విడిపించుకునే ప్రయత్నం చేసినా విడిచిపెట్టలేదు. డ్రైవర్ కూడా టీచర్‌తో గొడవకు దిగాడు. ప్రిన్సిపల్‌పై టీచర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. టీచర్ల ప్రవర్తనపై నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు.

Exit mobile version