Agra school: స్కూల్‌లోనే కొట్టుకున్న టీచర్-ప్రిన్సిపల్.. అసలేం జరిగిందంటే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గురువులంటే పది మందికి ఆదర్శంగా ఉండాలి. అలాంటిది ఈ మధ్య సభ్యత మరిచి ప్రవర్తిస్తున్నారు. కనీసం టీచర్లన్న ఇంగిత జ్ఞానం లేకుండా ప్రవర్తించి గౌరవాలను పోగొట్టుకుంటున్నారు. ఇటీవల ఉత్తరప్రదేశ్‌లోని పాఠశాలలో ప్రిన్సిపల్ ఫేషియల్ చేయించుకుంటుండగా టీచర్ మొబైల్‌లో చిత్రీకరిస్తుండగా ఆమెను కొట్టి చేతులు కొరికివేసింది. ఈ సంఘటనను మరువక ముందే ఆగ్రాలో మరో ఘటన వెలుగుచూసింది. ప్రిన్సిపల్-టీచర్ బూతులు తిట్టుకుంటూ కొట్టుకున్నారు. ఇద్దరి మధ్య ఏమైనా పగ ఉందో.. ఏమో తెలియదు గానీ.. బట్టలు చెరిగేలా కొట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
ఇది కూడా చదవండి: Uttarpradesh : రూ.50కోసం కన్న కొడుకుపై దారుణంగా దాడి చేసిన తండ్రి
Also Read
- SSY: ఆడపిల్ల భవిష్యత్తుకు బెస్ట్ పొదుపు పథకం.. నెలకు రూ.1,500 కడితే.. చేతికి రూ.8.32 లక్షలు.. పూర్తి వివరాలు ఇవే..
- BRICS Summit: అణిచివేతకు తలొగ్గం.. ఢిల్లీ వేదికగా అమెరికా, ఇజ్రాయెల్‌కు ఇరాన్ అధ్యక్షుడి మాస్ వార్నింగ్..!
- iPhone 18 వచ్చేసింది.. కానీ iPhone 17కే డిమాండ్.. కారణం తెలిస్తే షాక్ అవుతారు!
- BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!
టీచర్ ఆలస్యంగా వచ్చినందుకు ఆగ్రా స్కూల్ ప్రిన్సిపల్ గొడవకు దిగింది. అనంతరం ఆమెపై భౌతికదాడికి దిగింది. ఈ ఘర్షణలో ఇద్దరు వస్త్రాలు చిరిగిపోయాయి. అంతటితో ఆగకుండా నోటికి కూడా పని చెప్పారు. బూతులు తిట్టుకుంటూ కొట్టుకున్నారు. ప్రిన్సిపల్ డ్రైవర్ విడదీసే ప్రయత్నం చేసినా.. చివరికి టీచర్‌తో అసభ్యకరంగా ప్రవర్తించాడు.
ఇది కూడా చదవండి: Afternoon Sleep: మధ్యాహ్నం భోజనం చేశాక నిద్రపోతున్నారా? అయితే మీరు డేంజర్లో పడ్డట్లే..
ఆగ్రాలోని సీగానా గ్రామంలోని ప్రీ-సెకండరీ స్కూల్‌కు చెందిన టీచర్ గుంజన్ చౌదరి ఆలస్యంగా వచ్చింది. దీంతో ఆలస్యంగా వచ్చినందుకు ప్రిన్సిపల్ దాడికి తెగబడింది. ఆమె బట్టలను చించేసింది. విడిపించుకునే ప్రయత్నం చేసినా విడిచిపెట్టలేదు. డ్రైవర్ కూడా టీచర్‌తో గొడవకు దిగాడు. ప్రిన్సిపల్‌పై టీచర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. టీచర్ల ప్రవర్తనపై నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు.
A Principal in Agra beat up a teacher this bad just because she came late to the school. Just look at her facial expressions. She's a PRINCIPAL 😭 @agrapolice pic.twitter.com/db8sKvnNvs
— Deepika Narayan Bhardwaj (@DeepikaBhardwaj) May 3, 2024
తాజావార్తలు
-
SSY: ఆడపిల్ల భవిష్యత్తుకు బెస్ట్ పొదుపు పథకం.. నెలకు రూ.1,500 కడితే.. చేతికి రూ.8.32 లక్షలు.. పూర్తి వివరాలు ఇవే..
-
Indian Air Force: భారత్-యూకే రక్షణ సహకారంలో కొత్త అధ్యాయం.. బ్రిటిష్ పైలట్లకు ఇక భారత IAF శిక్షణ
-
DC Success Gift : అందరికి ఇచ్చి ‘వామికాగబ్బీ’కి కారు గిఫ్ట్ ఎందుకు ఇవ్వలేదు.?
-
BRICS Summit: అణిచివేతకు తలొగ్గం.. ఢిల్లీ వేదికగా అమెరికా, ఇజ్రాయెల్‌కు ఇరాన్ అధ్యక్షుడి మాస్ వార్నింగ్..!
-
iPhone 18 వచ్చేసింది.. కానీ iPhone 17కే డిమాండ్.. కారణం తెలిస్తే షాక్ అవుతారు!
ట్రెండింగ్
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?