Site icon NTV Telugu

Bus Fire Accident: కర్నూలు ఘటన మరవక ముందే.. మరో డబుల్ డెక్కర్ బస్సులో భారీ అగ్నిప్రమాదం.. ఎక్కడంటే?

Bus Fire Accident

Bus Fire Accident

Bus Fire Accident: కర్నూలు సమీపంలో జరిగిన దారుణ బస్సు ఘటన జరగక ముందే.. ఆగ్రా-లక్నో ఎక్స్‌ప్రెస్‌వేపై రెవ్రి టోల్ ప్లాజా సమీపంలో ఆదివారం తెల్లవారుజామున ఒక డబుల్ డెక్కర్ స్లీపర్ బస్సులో మరో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 70 మంది ప్రయాణికులు ఉండగా.. వారందరూ సురక్షితంగా బయటపడటంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో ప్రయాణికులకు ఎవరికీ గాయాలు కాలేదని అధికారులు తెలిపారు. బస్సు ఢిల్లీ నుంచి లక్నో మీదుగా గోండాకు ప్రయాణిస్తోంది. టోల్ ప్లాజాకు సుమారు 500 మీటర్ల దూరంలో బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ సమాచారం అందిన వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు.

Perni Nani: ఎంపీ కేశినేని చిన్ని మునిగిపోతున్న నావ.. పేర్ని నాని కీలక వ్యాఖ్యలు

అయితే అప్పటికే బస్సు డ్రైవర్, కండక్టర్ అప్రమత్తమై ప్రయాణికులందరినీ ముందుగా సురక్షితంగా కిందకు దించేశారు. ఇక అందిన ప్రాథమిక సమాచారం ప్రకారం.. బస్సు టైర్లలో మంట ఏర్పడడం వల్ల మంటలు చెలరేగి, త్వరగా వాహనం అంతటా వ్యాపించి ఉంటాయని డ్రైవర్ తెలిపినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఇక బస్సులో చెలరేగిన మంటలను అగ్నిమాపక సిబ్బంది అదుపులోకి తీసుకురాగా.. ప్రమాదానికి గురైన బస్సును రోడ్డు పక్కకు తొలగించి, ట్రాఫిక్ రాకపోకలను సాధారణ స్థితికి తీసుకొచ్చినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో ప్రయాణికులు ఎవరికీ ఇబ్బంది కలగకుండా ఉండేందుకు బస్సు యజమాని ప్రత్యామ్నాయ వాహనాన్ని ఏర్పాటు చేసి.. అందరూ వారి గమ్యస్థానాలకు చేరుకోవడానికి ఏర్పాట్లు చేశారు.

Minister Vangalapudi Anitha: రాష్ట్రానికి తుపాను ముప్పు.. సహాయక చర్యల కోసం కట్టుదిట్టంగా ఏర్పాట్లు పూర్తి..!

Exit mobile version