Site icon NTV Telugu

Agniban Rocket: విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లిన ప్రైవేట్ రాకెట్ అగ్నిబాన్..

Agniban

Agniban

Agniban rocket: తిరుపతి జిల్లాలోని శ్రీహరికోటలో మొదటి ప్రైవేట్ లాంచ్ పాడ్ నుంచి అగ్నిబాన్ ప్రైవేటు రాకెట్ నింగికెగిరి చరిత్ర సృష్టించింది. ఈ రోజు ఉదయం 7. 15 గంటలకు విజయవంతంగా షార్ లోని ప్రైవేట్ లాంచ్ పాడ్ నుంచి విజయవంతంగా ప్రయోగించారు. అయితే, గతంలో చివరి నిమిషంలో సాంకేతిక కారణాలతో నాలుగు సార్లు ప్రయోగం వాయిదా పడింది.. కానీ, 5వ ప్రయత్నంలో విజయవంతంగా ప్రయోగించిన చెన్నైకి చెందిన అగ్నికుల్ కాస్మోస్ స్టార్టప్ సంస్థ.. భూమికి 700 కిలో మీటర్లు ఎత్తులోని లో ఎర్త్ ఆర్బిట్ లో 300 కిలోల లోపు ఉపగ్రహాలను కక్ష్యలోకి పంపేందుకు ఈ ప్రయోగం చేపట్టింది. భారత అంతరిక్ష రంగాన్ని ప్రైవేటీకరణ చేసే దిశగా సాగుతున్న ప్రయత్నాలలో కీలకంగా మారిన ప్రయోగం.. ప్రయోగ ప్రక్రియను ఇస్రో చైర్మన్ డాక్టర్ సోమనాథ్ పర్యవేక్షించారు. కాగా, దేశంలోనే మొదటి సెమీ క్రయోజనిక్ఇంజిన్ ఆధారిత రాకెట్ ఇది.. భవిష్యత్లో చిన్న తరహా ఉపగ్రహాలను లోఎర్త్ ఆర్బిట్లో ప్రవేశపెట్టడానికి.. ఈ తరహా ప్రయోగాలను ఇస్రో ప్రోత్సహిస్తుంది.

Exit mobile version