NTV Telugu Site icon

Aghora Puja: మృతదేహంపై కూర్చొని అఘోరా పూజలు

Agora Puja

Agora Puja

తమిళనాడులో ఓ ఘటన కలకలం రేపుతుంది. ఏంటీ అనుకుంటున్నారా..? ఓ మృతదేహంపై అఘోరా పూజలు చేయడం కలకలం రేపాయి. మరణించిన వ్యక్తిపై కూర్చుని అఘోరా పూజలు చేయడం దేశవ్యాప్తంగా హాట్ టాఫిక్ గా మారింది. తమిళనాడులో రాష్ట్రంలో ఈ సంఘటన భయాందోళనకు గురిచేసింది. కోయంబత్తూర్ జిల్లా సూళ్లూరులో సమీపంలోని మణికంఠన్, అతని భార్య నివాసం ఉంటున్నారు. అయితే, భార్యతో గత కొంతకాలంగా గొడవలు జరుగుతుండటంతో మణికంఠన్ ఆవేశంలో సూసైడ్ చేసుకున్నాడు. మణికంఠన్ కుటుంబ సభ్యులు అతని డెడ్ బాడిని సూలూరుకి తీసుకువచ్చి అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు.

Also Read : Balakrishana : బాలయ్య సినిమా కోసం అదిరిపోయే టైటిల్ ఫిక్స్ చేసిన అనిల్ రావిపూడి

అయితే, సరిగ్గా అదే టైంలో మణికంఠన్ ఫ్రెండ్స్ అంటూ కొంతమంది అఘోరాలు అక్కడికి వచ్చారు. అతని ఆత్మశాంతి కోసం అఘోరాలు కొన్ని పూజలు చేయాలని చెప్పారు. అందుకు కుటుంబసభ్యులు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో మణికంఠన్ శవంపై కూర్చుని ధ్యానం చేస్తూ ఏవో మంత్రాలు చదువుతూ ఓ అఘోరా పూజలు చేశాడు. మణికంఠ డెడ్ బాడీపై అఘోరా పద్మాసనం వేసుకుని కూర్చుని పెద్ద పెద్ద కేకలు వేస్తూ.. పూజలు చేస్తుంటే.. అతని అనుచరులు మాత్రం ఢమరుకం వాయిస్తూ.. శంఖం ఊదుతూ పెద్ద పెద్ద శబ్దాలు చేశారు.

Also Read : Delhi Girl Murder Case: ఢిల్లీ మర్డర్‌ కేసు నిందితుడికి పోలీస్‌ కస్టడీ..

ఈ తతంగం అంతా చూసేవారిని తీవ్రమైన భయభ్రాంతులకు గురి చేసింది. అయితే దీనిపై స్థానికులు కొందరు ఆందోళన వ్యక్తం చేశారు.. మరికొందరు మాత్రం చనిపోయిన వ్యక్తిపై కూర్చుని ఈ పూజలేంటని ప్రశ్నించారు. ఈ అఘోరాలను ఇంకొందరు వింతగా చూశారు. చనిపోయిన స్నేహితుడి శవంపై కూర్చుని పూజలు ఏంటి?..అలా చేస్తే అతని ఆత్మశాంతి ఎట్లా కలుగుతుంది అంటూ అఘోరా చేసిన పూజ ప్రస్తుతం సంచలనంగా మారింది.

Show comments