NTV Telugu Site icon

Ind vs Nz: ఆటకు మళ్లీ అడ్డంకి.. మ్యాచ్‌ను 29 ఓవర్లకు కుదింపు

Match

Match

Ind vs Nz: వరుణుడు మ్యాచ్‌ను సాఫీగా సాగనివ్వడం లేదు. మరోసారి వరుణుడు అంతరాయం కలిగించాడు. దీంతో 12.5 ఓవర్ల వద్ద ఆటను అంపైర్లు నిలిపేశారు. హామిల్టన్‌లోని సెడాన్ పార్క్‌లో జరుగుతున్న రెండో వన్డేకు వరుణుడు అంతరాయం కలిగించినప్పటికీ.. మ్యాచ్‌ను 29 ఓవర్లకు కుదించి ఆటను ప్రారంభించారు. వర్షం తగ్గిపోవడంతో భారత్-న్యూజిలాండ్‌ జట్ల మధ్య రెండో వన్డే మ్యాచ్‌ను 29 ఓవర్లకు కుదిస్తూ అంపైర్లు నిర్ణయం తీసుకున్నారు. ఆటను ఆపే సమయానికి 4.5 ఓవర్లలో 22/0 స్కోరుతో ఉన్న భారత్‌కు రెండోబంతికే షాక్ తగిలింది. దూకుడుగా ఆడేందుకు ప్రయత్నించిన శిఖర్ ధావన్ (3) మ్యాట్ హెన్రీ బౌలింగ్‌లో (5.1వ ఓవర్‌) ఫెర్గూసన్ చేతికి క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. దీంతో 23 పరుగుల వద్ద భారత్‌ తొలి వికెట్‌ను కోల్పోయింది. ప్రస్తుతం క్రీజులో శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్‌ యాదవ్‌ ఉన్నారు. కానీ 12.5 ఓవర్ల వద్ద వర్షం మళ్లీ పుంజుకోవడంతో ఆటను నిలిపివేశారు.

Ind vs Nz 2nd odi: ఆటకు అడ్డంకిగా మారిన వరుణుడు.. కొనసాగడం కష్టమే!

ఆక్లాండ్‌లో జరిగిన తొలి వన్డేలో ఓటమి పాలైన భారత జట్టుకు ఈ మ్యాచ్ ఎంతో కీలకం. సిరీస్ రేసులో నిలవాలంటే ఈ మ్యాచ్‌లో నెగ్గడం తప్పనిసరి. అయితే, మ్యాచ్ మాత్రం కొనసాగేలా కనిపించడం లేదు. హమిల్టన్‌లో వర్షం పడే అవకాశాలు 90 శాతం ఉండడమే అందుకు కారణం. వన్డే సిరీస్‌ రేసులో నిలవాలంటే భారత్‌ తప్పక నెగ్గాల్సిందే. తొలి మ్యాచ్‌లో భారీ లక్ష్యం నిర్దేశించినా ఓటమి తప్పలేదు. ఈ క్రమంలో హామిల్టన్‌ వేదికగా న్యూజిలాండ్‌తో రెండో వన్డేలో తలపడుతోంది. టాస్‌ నెగ్గిన కివీస్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ బౌలింగ్‌ ఎంచుకొన్నాడు. వర్షం ప్రభావం కారణంగా హామిల్టన్ మైదానం కాస్త చిత్తడిగా మారింది. దీంతో టాస్‌ ఆలస్యమైంది. స్వదేశంలో వరుసగా 13 వన్డేలు గెలిచిన కివీస్‌ను అడ్డుకోవడం భారత్‌కు సులువేం కాదు.