CAA: సీఏఏ దరఖాస్తుదారులకు కేంద్రం మరో గుడ్‌న్యూస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సార్వత్రిక ఎన్నికల ముందు పౌరసత్వ సవరణ చట్టాన్ని కేంద్రం అమల్లోకి తెచ్చింది. 2014కు ముందు వచ్చిన ముస్లిమేతరులకు భారత పౌరసత్వం ఇవ్వాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించి కేంద్రం మరొక నిర్ణయం తీసుకుంది. దరఖాస్తుదారుల కోసం త్వరలో హెల్ప్‌లైన్ ప్రారంభించనున్నట్లు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
మొత్తం ప్రక్రియ ఆన్లైన్లో ఉంటుంది కాబట్టి దరఖాస్తుదారుల సౌలభ్యం కోసం హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒక పోర్టల్‌ను కూడా సిద్ధం చేసింది. దరఖాస్తుదారులు ప్రయాణ పత్రాలు లేకుండా భారత్‌లోకి ప్రవేశించిన సంవత్సరాన్ని తప్పనిసరిగా ప్రకటించాలి.
Also Read
- Eng vs NZ: లార్డ్స్ టెస్టులో బౌలర్ల హవా.. తొలి రోజే 16 వికెట్లు డౌన్.. అసలేమవుతోంది.?
- Vladimir Putin: "మోడీపై ఒత్తిడి తేవడం ఎవరి తరం కాదు".. భారత్‌కు రష్యా అధ్యక్షుడు పుతిన్ గట్టి మద్దతు
- Suryakumar Yadav: ఏడాదిలోనే హీరో నుంచి జీరోగా? సూర్యకుమార్ హిస్టరీలో బిగ్ ఫెయిల్యూర్స్ ఇవే..
- Story Board: తెలంగాణ రాజకీయ సమీకరణాలు మారతాయా..? పవన్ ఎంట్రీతో ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..?
డిసెంబర్ 31, 2014 కంటే ముందు భారత్‌కి వచ్చిన పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఎలాంటి పత్రాలు లేని ముస్లిమేతర వలసదారులకు పౌరసత్వం మంజూరు చేయడమే పౌరసత్వ సవరణ చట్టం ఉద్దేశం. CAA-2019కి సంబంధించిన సమాచారాన్ని పొందేందుకు దరఖాస్తుదారులు దేశంలోని ఎక్కడి నుంచైనా టోల్ ఫ్రీ నంబర్ ద్వారా సమాచారం తెలుసుకోవచ్చని భారత మంత్రిత్వ శాఖ తెలిపింది.
ఈ సేవ ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకు అందుబాటులో ఉంటుందని వెల్లడించింది. పాక్, అఫ్ఘనిస్థాన్, బంగ్లాదేశ్ నుంచి.. 2014 డిసెంబరు 31కి ముందు భారత్‌కు వలస వచ్చిన హిందువులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, పార్శీలు, క్రైస్తవులు భారతపౌరసత్వం మంజూరు కోసం https:/indiancitizenshiponline.nic.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
పాస్‌పోర్టు సైజు ఫొటోతో పాటు అవసరమైన ధ్రువీకరణ పత్రాలను ఆన్లైన్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. దర్యాప్తు సంస్థలు బ్యాక్‌గ్రౌండ్ పరిశీలన పూర్తి చేసిన తర్వాత వాటిని ప్రాసెస్ చేస్తారు. నిర్దేశిత అధికారి నేతృత్వంలోని జిల్లా స్థాయి కమిటీ ద్వారా సాధికార కమిటీకి ఈ దరఖాస్తును సమర్పిస్తారు. ఈ చట్టం ఎలాంటి పత్రాలు లేనివారి కోసం ఉద్దేశించినందున, దరఖాస్తుదారులు అంతకుముందు తాము నివసించిన దేశాల్లో అక్కడి ప్రభుత్వాలు జారీ చేసిన ఏవైనా పత్రాలను అప్లోడ్ చేయవచ్చు.
దరఖాస్తుదారులు ఆయా దేశాల్లో తమకు ప్రస్తుతం ఉన్న పౌరసత్వాన్ని వదులుకోవడంతో పాటు భారతదేశాన్ని శాశ్వత చిరునామాగా అంగీకరిస్తూ డిక్లరేషన్ ఇవ్వాలి. విధేయతతో కూడిన ప్రమాణం కూడా చేయాల్సి ఉంటుంది. అలాగే వారు హిందూ, సిక్కు, జైన, బౌద్ధ, పార్శీ, క్రైస్తవ మతాలకు చెందినవారని, ప్రస్తుతం ఆయా మతాల్లోనే కొనసాగుతున్నారని ధ్రువీకరిస్తూ గుర్తింపు పొందిన ఏదైనా స్థానిక సంస్థ జారీ చేసిన అర్హత సర్టిఫికెట్‌ను సమర్పించాలి.
వీటితో పాటు పౌరసత్వం కోసం ఈ కింది పత్రాల్లో ఏదైనా ఒకదాన్ని సమర్పించవచ్చు. పాక్, అఫ్ఘన్స్థాన్, బంగ్లాదేశ్ ప్రభుత్వం జారీ చేసిన పాస్‌పోర్ట్, జనన ధ్రువీకరణ పత్రం/ ఏదైనా లైసెన్స్/ భూమి లేదా కౌలు రికార్డులు, స్టడీ సర్టిఫికెట్లు, అక్కడి ప్రభుత్వాలు మంజూరు చేసిన మరేదైనా గుర్తింపు పత్రంతో పాటు దరఖాస్తుదారుని తల్లిదండ్రులు లేదా తాతలు, ముత్తాతల్లో ఒకరు ఆయా దేశాలకు చెందినవారని నిరూపించే ఏదైనా పత్రం, దరఖాస్తుదారులు ఆయా దేశాల నుంచి వచ్చినట్లు నిర్ధారించేందుకు అక్కడి ప్రభుత్వాలు లేదా ప్రభుత్వ సంస్థలు జారీ చేసిన ఏ పత్రాన్నయినా ఆమోదిస్తారు. ఒకవేళ వాటి కాలపరిమితి దాటినా కూడా అవి చెల్లుబాటు అవుతాయని నిబంధనల్లో పేర్కొన్నారు.
దరఖాస్తుదారుడు 2014, డిసెంబరు 31 కంటే ముందే భారతదేశంలోకి ప్రవేశించినట్లుగా రుజువు చేసేందుకు ఈ పత్రాల్లో ఏదో ఒకదాన్ని సమర్పించాల్సి ఉంటుంది. భారత్‌కు వచ్చిన సమయంలోని వీసా కాపీ, ఇమిగ్రేషన్ స్టాంప్ కాపీలు, గ్రామీణ, పట్టణ సంస్థలకు ఎన్నికైన సభ్యులు లేదా రెవెన్యూ అధికారి జారీ చేసిన ధ్రువీకరణ పత్రం, భారత్‌లో జన గణన సమయంలో ఎన్యూమరేటర్లు జారీ చేసిన స్లిప్, డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, స్కూల్ టీసీ, విద్యార్హత సర్టిఫికెట్లు, వ్యాపార లైసెన్స్‌ను సమర్పించాల్సి ఉంటుంది.
తాజావార్తలు
-
Friday Horoscope: శుక్రవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి అన్ని శుభవార్తలే, పండగే ఇవాళ!
-
Eng vs NZ: లార్డ్స్ టెస్టులో బౌలర్ల హవా.. తొలి రోజే 16 వికెట్లు డౌన్.. అసలేమవుతోంది.?
-
Vladimir Putin: “మోడీపై ఒత్తిడి తేవడం ఎవరి తరం కాదు”.. భారత్‌కు రష్యా అధ్యక్షుడు పుతిన్ గట్టి మద్దతు
-
Suryakumar Yadav: ఏడాదిలోనే హీరో నుంచి జీరోగా? సూర్యకుమార్ హిస్టరీలో బిగ్ ఫెయిల్యూర్స్ ఇవే..
-
Donald Trump: మోడీ నాకు మంచి స్నేహితుడు.. భారత్‌తో త్వరలో వాణిజ్య ఒప్పందం..
ట్రెండింగ్
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్‌లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్‌ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!