IPL 2025 Captains: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 వేలం తర్వాత అన్ని జట్లు ఇప్పుడు కొత్తగా కనిపిస్తున్నాయి. ఇకపోతే వేలం ముందు చాలా జట్లు వేలానికి ముందే తమ జట్టు కెప్టెన్‌లను కొనసాగించగా, కొన్ని జట్లు మాత్రమే తమ మునుపటి కెప్టెన్‌లను విడుదల చేశాయి. దీనితో ఆసక్తికరంగా IPL 2025లో కొన్ని జట్లలో కొత్త కెప్టెన్లు కనిపించబోతున్నారు. మరి ఏ ఆటగాడు ఏ జట్టుకు కెప్టెన్ కాబోతున్నాడో ఒకసారి చూద్దాం.
ఢిల్లీ క్యాపిటల్స్ (DC) వేలానికి ముందు రిషబ్ పంత్‌ను విడుదల చేసింది . అదేవిధంగా, కోల్కతా కూడా కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్‌తో సంబంధాలను తెంచుకుంది. ఇప్పుడు రెండు జట్లకు కొత్త కెప్టెన్లు నాయకత్వం వహిస్తారు. ఇకపోతే వేలంలో వెంకటేష్ అయ్యర్‌ను కేకేఆర్ వేలంలో రూ. 23.75 కోట్లకు కొనుగోలు చేసింది. దింతో అతనికి కెప్టెన్సీ ఇస్తారేమో అని భావిస్తున్నారు అభిమానులు. కాకపోతే అతడికి ఇప్పటి వరకు కెప్టెన్సీ చేసిన అనుభవం లేదు. అయితే , చివరి నిమిషంలో టీంలోకి వచ్చిన అనుభవజ్ఞుడు అజింక్య రెహానేకు కెప్టెన్సీ అప్పగిస్తారని కొందరు క్రికెట్ నిపుణులు. ఇక మరోవైపు రూ. 14 కోట్లు చెల్లించి జట్టును కొనుగోలు చేసిన కేఎల్ రాహుల్ చేతిలో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్సీ ఉండే అవకాశం ఉంది.
Also Read: Bangladesh Violence: ఇస్కాన్‌ను నిషేధించాలని బంగ్లాదేశ్ హైకోర్టులో పిటిషన్.. హిందువుల నిరసన
ఇక ఆర్సీబి ఫాఫ్ డు ప్లెసిస్‌ను కూడా విడుదల చేసింది. దింతో ఐపీఎల్ 2025కి విరాట్ కోహ్లీని తిరిగి కెప్టెన్‌గా తీసుకునే అవకాశం కనపడుతోంది. అతను 2013 నుండి 2021 వరకు RCBకి కెప్టెన్‌గా ఉన్నాడు. రాహుల్‌ని విడుదల చేసిన ఎల్‌ఎస్‌జీ రిషబ్ పంత్‌ను రూ. 27 కోట్లకు కొనుగోలు చేసింది. కాబట్టి వచ్చే సీజన్‌లో ఎల్‌ఎస్‌జీకి నాయకత్వం వహిస్తానడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అలాగే రూ. 26.75 కోట్ల భారీ ధరకు శ్రేయాస్ అయ్యర్‌ను పంజాబ్ కింగ్స్ కొనుగోలు చేసింది. ఆయన పీబీకేఎస్‌కు కెప్టెన్‌గా వ్యవహరించడం దాదాపు ఖాయమే. అతని నాయకత్వంలో కక్ల్కతా IPL 2024 టైటిల్‌ను గెలుచుకుంది. ఇంతకు ముందు కూడా ఢిల్లీ క్యాపిటల్స్ కి నాయకత్వం వహించాడు.
Also Read: Honda Activa Electric: అబ్బురపరిచే ఫీచర్లతో మార్కెట్లోకి వచ్చేసిన హోండా యాక్టివా ఎలక్ట్రిక్
ఇక చెన్నై సూప్ కింగ్స్ కెప్టెన్‌గా రుతురాజ్ గైక్వాడ్ వ్యవహరించనున్నాడు. అతడిని సీఎస్‌కే కొనసాగించింది. మహేంద్ర సింగ్ ధోని కెప్టెన్సీ నుంచి తప్పుకున్న తర్వాత అతను జట్టుకు సారథ్యం వహిస్తున్నాడు. 2024 సీజన్ పేలవంగా ఉన్నప్పటికీ, ముంబై ఇండియన్స్ (MI) తదుపరి సీజన్‌కు కూడా హార్దిక్ పాండ్యాను కెప్టెన్‌గా కొనసాగించవచ్చు. అతని కెప్టెన్సీలో హార్దిక్ గుజరాత్ టైటాన్స్ (GT)ని వరుసగా 2 సీజన్లలో (2022, 2023) ఫైనల్స్‌కు తీసుక వెళ్లి ఒకసారి కప్ కూడా గెలిచాడు. గత కొన్ని సీజన్లలో విజయవంతమైన కెప్టెన్సీ తర్వాత రాజస్థాన్ రాయల్స్ (RR) సంజూ శాంసన్‌తో కలిసి ఉండే అవకాశం ఉంది. రషీద్ ఖాన్, జోస్ బట్లర్ వంటి అనుభవజ్ఞులైన ఆటగాళ్లు ఉన్నప్పటికీ గుజరాత్ టైటాన్స్ (GT) IPL 2025కి తమ కెప్టెన్‌గా శుభమాన్ గిల్‌ను కొనసాగించే అవకాశం ఉంది. బ్యాట్స్‌మన్‌ని ఫ్రాంచైజీ తన వద్దే ఉంచుకుంది. ఇక సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) వేలానికి ముందు తమ కెప్టెన్ పాట్ కమిన్స్‌ను కొనసాగించింది. వచ్చే సీజన్‌లోనూ అతను జట్టుకు నాయకత్వం వహిస్తాడు. అతని నాయకత్వంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఐపీఎల్ 2024లో రన్నరప్‌గా నిలిచింది.