NTV Telugu Site icon

Team India: బెంగళూరు టెస్టు డ్రా లేదా ఓడిపోయినా టీమిండియా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‭కు చేరుకుంటుందా?

Wtc Teamindia

Wtc Teamindia

Team India: టీమిండియా, న్యూజిలాండ్ మధ్య 3 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో ప్రస్తుతం మొదటి మ్యాచ్ జరుగుతోంది. అక్టోబర్ 16 నుంచి ఈ మ్యాచ్ ప్రారంభమైంది. నేడు (అక్టోబర్ 20) మ్యాచ్ ఐదో రోజు. ఈ మ్యాచ్‌లో భారత జట్టు తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 46 పరుగులకే ఆలౌట్ అయింది. కాగా, న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 402 పరుగులు చేసింది. దీంతో భారత్ తన రెండో ఇన్నింగ్స్‌లో అద్భుతంగా ఎదురుదాడి చేసి 462 పరుగులు చేసింది. దాంతో న్యూజిలాండ్‌కు 107 పరుగుల లక్ష్యం లభించింది. ఈ మ్యాచ్‌లో మొదటి రోజు వర్షం కారణంగా రద్దవగా.. నాలుగో రోజు కూడా వర్షం అంతరాయం కలిగింది. ఈరోజు (అక్టోబర్ 20) కూడా వర్షాలు కురిసే అవకాశం ఉన్నాయని వాతావరణ శాఖ అంచనాలు వేసింది.

Muzaffarnagar: ప్రవక్తపై చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలతో వీధుల్లోకి వచ్చిన వేలాది మంది ముస్లింలు

కాగా, బెంగళూరు టెస్టు మ్యాచ్‌లో వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ ముందే అంచనా వేసింది. ఈ పరిస్థితిలో, ఈ మ్యాచ్ వర్షంతో ఆగిపోతే.. అంటే డ్రా అయినట్లయితే ఐసిసి ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో ఫైనల్ రేసు నుండి భారత జట్టు ఔట్ అవుతుందా అనే ప్రశ్న చాలా మందిలో ఖచ్చితంగా ఉంటుంది. ఒకవేళ భారత జట్టు ఓడినా.. భారత్ అవకాశాలపై ప్రభావం పడుతుందా? అనే విషయాలను ఒకసారి చూద్దాం. ఈ మ్యాచ్ వర్షం కారణంగా జగకపోతే, ఈ మ్యాచ్ డ్రాగా పరిగణించబడుతుంది. దీన్ని బట్టి ఫైనల్ చేరే మార్గం భారత జట్టుకు కాస్త కష్టంగా అనిపించవచ్చు. బెంగళూరులో ఓడిపోతే తదుపరి మ్యాచ్‌ల్లో తప్పక గెలవాల్సిందే. ప్రస్తుతం భారత జట్టు WTC పాయింట్లలో 74.24 శాతంతో అగ్రస్థానంలో ఉంది. 62.5 శాతంతో విజయాల శాతంతో ఆస్ట్రేలియా రెండో స్థానంలో ఉంది.

Off The Record : జీవో 29 కాంగ్రెస్ కు ఇబ్బంది అవుతుందా ? రాహుల్ గాంధీ రంగంలోకి దిగుతారా ?

బెంగళూరు టెస్ట్ తర్వాత, ఈ WTC సీజన్ 2023-25లో భారత జట్టు మరో 7 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంటుంది. ఈ టెస్ట్ డ్రా లేదా ఒదిన తర్వాత, భారత జట్టు తన మిగిలిన 7 మ్యాచ్‌లలో కనీసం 3 గెలవవలసి ఉంటుంది. 4 మ్యాచ్‌లు గెలిస్తే స్థానం దాదాపు ఖాయం. 3 టెస్టులు గెలిచిన పక్షంలో, భారత్ వేరే జట్టు గెలుపు లేదా ఓటమిపై ఆధారపడాల్సి రావచ్చు. భారత జట్టు తన తదుపరి 7 మ్యాచ్‌లు న్యూజిలాండ్, ఆస్ట్రేలియాతో మాత్రమే ఆడాలి. ఇందులో ప్రస్తుత సిరీస్‌లో మిగిలిన అంటే చివరి 2 మ్యాచ్‌లు కివీ జట్టుతో ఆడాల్సి ఉంటుంది. ఆపై ఆస్ట్రేలియా జట్టుతో స్వదేశంలో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ జరగనుంది.

Show comments