Forest Officials Give Permission To Kill Leopard: జార్ఖండ్‌లోని గర్వా, దాని పరిసర ప్రాంతాల్లో నలుగురు వ్యక్తుల ప్రాణాలను బలిగొన్న చిరుతపులిని చంపడానికి జార్ఖండ్ అటవీ శాఖ షరతులతో కూడిన అనుమతిని ఇచ్చిందని ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ (వన్యప్రాణి) బుధవారం తెలిపారు. డిసెంబర్ 2022లో, ఈ చిరుతపులి వేర్వేరు సందర్భాలలో జార్ఖండ్‌లో కనీసం నలుగురి ప్రాణాలను బలిగొంది.
గతంలో, మనేంద్రగఢ్ ఫారెస్ట్ డివిజన్ పరిధిలోని జనక్‌పూర్ ఫారెస్ట్ రేంజ్‌లోని కున్వారి బీట్ కంపార్ట్‌మెంట్ 1341 సమీపంలోని అడవికి ఆనుకుని ఉన్న పొలంలో చిరుతపులి ఒక వ్యక్తిని చంపిందని అటవీ అధికారి తెలిపారు. ఆదివారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు సమాచారం. మృతి చెందిన వ్యక్తిని రామ్‌దావన్‌గా గుర్తించారు. సమాచారం అందుకున్న అటవీశాఖ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. చిరుతను పట్టుకునేందుకు వివిధ విభాగాల నుంచి అధికారుల బృందం చేరుకుంది.
Fake Website: అచ్చం ప్రభుత్వ పోర్టల్‌లాగే నకిలీ వెబ్‌సైట్.. మోసగాళ్ల ముఠా అరెస్ట్
జనక్‌పూర్ అటవీ రేంజ్‌లో చిరుతపులి దాడి కారణంగా ఇప్పటివరకు రెండు మరణాలు సహా మూడు సంఘటనలు ఉన్నాయని సర్గుజా వైల్డ్‌లైఫ్ ఫారెస్ట్ కన్జర్వేటర్ కేఆర్ బధాయి అన్నారు. ఆ సంఘటనలను దృష్టిలో ఉంచుకుని, అటవీ శాఖ వారు పట్టుకోవడానికి బోనులు, ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేశారని తెలిపారు. కానీ ఇప్పటికీ చిరుతను పట్టుకోవడంలో విఫలమైందన్నారు. చిరుతను ఎలాగైనా పట్టుకోవడానికి తమకు ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ అనుమతి లభించిందని ఆయన వెల్లడించారు. నిపుణుల బృందం కూడా చేరుకుందని.. చిరుతను వీలైనంత త్వరగా పట్టుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. ఇటీవల జనవరి 3న చిరుతపులి దాడితో ఓ మహిళ మృతి చెందింది. మనేంద్రగఢ్ అటవీ డివిజన్ పరిధిలో చిరుతపులి దాడుల కారణంగా 2022 డిసెంబర్ నుండి ఇప్పటివరకు ముగ్గురు మృతి చెందగా, ఒక చిన్నారికి గాయాలయ్యాయి.
